Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలూ తగ్గాయి!
వరుసగా పైకి కదులుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త నిదానించాయి..
వరుసగా పైకి కదులుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త నిదానించాయి.. ఈరోజు (ఏప్రిల్ 9) బంగారం ధరలు పది గ్రాములకు 130 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు వెండి ధరలు కూడా కేజీకి 330 రూపాయల తగ్గుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (09.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు బుధవారం నాటి ధర కంటే 130 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 360 రూపాయల తగ్గుదలతో 43,800 రూపాయలు నమోదు చేసింది.
భారీగా తగ్గిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 330 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే కిందికి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,950 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 130 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,030 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు360 రూపాయల తగ్గుదలతో 43,800 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 40,950 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో..
ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 120 రూపాయల తగ్గుదలతో 44,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల తగ్గుదలతో 42,170 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. 41 వేల మార్కుకంటే కిందకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 40,950 రూపాయల వద్దనిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.