నిన్న ఒక్కరోజు బ్రేక్ పడిన బంగారం ధరల పెరుగుదల మళ్ళీ ఈరోజు పైకి కదిలించి. ఈరోజు (ఏప్రిల్ 8) బంగారం ధరలు పది గ్రాములకు 130 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు భారీ స్థాయిలో కేజీకి 920 రూపాయల పెరుగుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఒక్క రోజు బ్రేక్పె తరువాత ఈరోజు రుగుదల నమోదు చేశాయి. బుధవారం (08.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 130 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,160 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 130 రూపాయల పెరుగుదలతో 43,160 రూపాయలు నమోదు చేసింది.
భారీగా పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి ఏకంగా 920 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,280 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నం లలో..
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 130 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,160 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 130 రూపాయల పెరుగులతో 44,160 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. వెండి ధర 41,280 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో..
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెఉగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 360 రూపాయల పెరుగుదలతో 44,620 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 310 రూపాయల పెరుగుదలతో 42,270 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 41 వేల మార్కు దాటి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,280 రూపాయల వద్దనిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.