దిగొచ్చిన బంగారం ధరలు..భారీగా పడిపోయిన వెండి ధర!

Update: 2020-02-04 01:55 GMT

కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు దిగివచ్చాయి. నిన్నటి ధరల కంటే ఈరోజు (04.02.2020) స్వల్పంగా బంగారం ధర తగ్గింది.

దిగివచ్చిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 90 రూపాయలు తగ్గింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,760 నుంచి 42,670 రూపాయలకు తగ్గింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 120 రూపాయలు తగ్గడంతో 39,230 నుంచి 39,110 రూపాయల వద్దకు చేరుకుంది.

భారీగా పడిపోయిన వెండి ధరలు..

ఒకవైపు బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కేజీకి 990 రూపాయలు దిగొచ్చాయి. దీంతో వెండి ధరలు కేజీకి 49,000 రూపాయల వద్దనిలిచాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,670 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,110 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,000 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 60 రూపాయలుతగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,150 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,950 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా తగ్గింది.. దాంతో వెండి ధర కేజీకి 49,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News