Gold Rate Today: పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
Gold Rate Today: మన దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి.
Gold Rate Today: పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
Gold Rate Today: మన దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర లక్షా 2 వేలకు చేరింది. నిన్నటి ధరతో పోల్చితే 700 రూపాయలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 11 వేల 300కు చేరింది. అంటే నిన్నటి ధరపై 780 రూపాయలు పెరిగింది. ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.