Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధరలు.. సామాన్యులకు అదిరిపోయే ఛాన్స్
Gold Rate Today : దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,61,120 కు చేరుకుంది. వెండి కేజీ ధర రూ. 2.89 లక్షల వద్ద కొనసాగుతోంది.
Gold Rate Today
Gold Rate Today : భారతీయ మార్కెట్‌లో పసిడి ప్రేమికులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు రివర్స్ గేర్ వేశాయి. వారం క్రితం వరకు సరికొత్త రికార్డులను సృష్టించిన పసిడి, గత పది రోజులుగా క్రమంగా దిగివస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. సామాన్యులకు ఇది గోల్డ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. మార్చి 7 (శనివారం) నాటికి దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు మీకోసం..
ప్రస్తుతం మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 16,112 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 14,769 కు చేరుకుంది. అంటే తులం బంగారం కొనాలంటే లక్షన్నర పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. ధరలు తగ్గుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఇవి ఇంకా భారీ స్థాయిలోనే ఉండటం గమనార్హం. మన తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,120 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,690 గా ఉంది. వైజాగ్, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో ధరలు మిగిలిన ప్రాంతాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,63,190 గా రికార్డ్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు 24 క్యారెట్లకు రూ. 1,61,270 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముంబై, బెంగళూరులలో కూడా హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల ధర రూ. 1,61,120 వద్ద స్థిరంగా ఉంది.
వెండి ధరలో స్వల్ప మార్పు
బంగారంతో పాటు వెండి కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో గ్రాము వెండి ధర రూ.289.90 పలుకుతోంది. అంటే కేజీ వెండి కొనాలంటే ఏకంగా రూ. 2,89,900 చెల్లించాల్సిందే. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై వంద రూపాయల మేర స్వల్ప తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండికి ఉన్న డిమాండ్ ఆధారంగా మన దేశంలో కూడా ధరలు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను లాభాల్లోకి మార్చుకుంటున్నారు. దీనివల్ల పసిడి ధరలు తగ్గుతున్నాయి. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు భారీగా పడిపోయే అవకాశం లేదని, కాస్త అటూ ఇటుగా ఇవే రేట్లు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.