India-Russia Energy Trade: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్.. రష్యా చమురు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

India-Russia Energy Trade: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది.

Update: 2026-03-06 03:04 GMT

India-Russia Energy Trade: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్.. రష్యా చమురు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

Hormuz crisis: ప్రస్తుతం ప్రపంచం ఒక వింతైన వ్యూహాత్మక చదరంగంలో ఉంది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు, మరోవైపు మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు. ఈ రెండు క్లిష్ట పరిస్థితుల మధ్య, ప్రపంచ ఇంధన సరఫరాలను స్థిరీకరించేందుకు అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశానికి 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు వాషింగ్టన్ ప్రకటించింది.

స్కాట్ బెసెంట్ ప్రకటనతో మారిన సీన్

అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఎక్స్ (X) వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగిపోకుండా ఉండటానికి, భారతీయ రిఫైనర్లు రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీని వెనుక ఒక ఆశ కూడా ఉంది. భవిష్యత్తులో భారత్ తన ఇంధన అవసరాల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని పెంచుతుందని వాషింగ్టన్ భావిస్తోంది.

హార్ముజ్ జలసంధి సెగ.. భారత్ ముందుజాగ్రత్త

మధ్యప్రాచ్యంలో ఇరాన్ దాడుల భయంతో హార్ముజ్ జలసంధి పాక్షికంగా మూతపడే ప్రమాదం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 40% ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఒకవేళ ఇక్కడ సరఫరా నిలిచిపోతే, భారత్ వంటి భారీ వినియోగదారు దేశం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే, ప్రత్యామ్నాయంగా రష్యా నుండి వచ్చే చమురు భారత్‌కు ఇప్పుడు ఒక లైఫ్ లైన్‌లా మారింది.ప్రస్తుతం దాదాపు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు భారత జలాల దిశగా వస్తోంది. మన దేశంలో అత్యవసర చమురు నిల్వలు కేవలం 25 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇచ్చిన మినహాయింపు భారత్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా చమురు భారత్‌కు తక్కువ ధరకు లభిస్తోంది. జనవరిలో దిగుమతులు స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా 30% గా ఉంది.ఇరాన్ ఒత్తిడిని తగ్గించడం. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను ఇరాన్ ప్రభావితం చేయకుండా చూడటం అమెరికా లక్ష్యం. చమురు ధరలు ఆకాశాన్నంటకుండా చూడటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడటం.భారత్‌తో బంధం న్యూఢిల్లీని ఒక ముఖ్యమైన భాగస్వామిగా గుర్తించడం.సాంకేతికత ,దౌత్యనీతి మేళవించిన ఈ చమురు యుద్ధంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే, అగ్రరాజ్యాలతో సమతుల్యతను పాటిస్తోంది. అయితే ఈ 30 రోజుల గడువు తర్వాత అమెరికా వైఖరి ఎలా ఉంటుంది? భారత్ అమెరికా నుండి దిగుమతులను పెంచుతుందా? అనేది వేచి చూడాలి.




Tags:    

Similar News