Stock Market Crash: హోలీ వేళ కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ. 9 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Crash: హోలీ పండుగ వేళ భారతీయ స్టాక్ మార్కెట్‌ కుప్పకూలింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి.

Update: 2026-03-04 14:09 GMT

Stock Market Crash

Stock Market Crash: హోలీ పండుగ వేళ భారతీయ స్టాక్ మార్కెట్‌ కుప్పకూలింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేశాయి. బుధవారం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమవ్వడంతో పెట్టుబడిదారులు ఏకంగా రూ.9 లక్షల కోట్లను కోల్పోయారు.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే:

* అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ఇరాన్ సుప్రీం నేత మృతి తర్వాత ఇజ్రాయెల్-అమెరికా - ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ యుద్ధం మరికొంత కాలం కొనసాగవచ్చన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌లో భయాందోళనలు పెంచాయి.

* ముడి చమురు ధరల పెరుగుదల: యుద్ధం కారణంగా సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు $82 మార్కును దాటింది.

* రికార్డు కనిష్టానికి రూపాయి: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 66 పైసలు క్షీణించి, 92.15 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.

* విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు (FII): యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం మార్చి 2వ తేదీనే వీరు ఏకంగా రూ.3,295 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

* గడిచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ.20 లక్షల కోట్లు నష్టపోయారు.

* ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (KOSPI) ఏకంగా 8% పడిపోయింది.

* BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.456 లక్షల కోట్ల నుంచి రూ.448 లక్షల కోట్లకు పడిపోయింది.

ప్రస్తుతం యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో, ఎంత విధ్వంసం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడుతోందని అన్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితం అవుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News