Service Charge: రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారా..? తిరిగిచ్చేయాల్సిందే..!
Restaurant Service Charge Rules India: బయట రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లినప్పుడు రుచికరమైన భోజనం చేసి, బిల్లు చూశాక ఒక్కసారిగా షాక్ తింటున్నారా? మెనూ కార్డులో ఉన్న ధరల కంటే బిల్లులో అంకెలు భారీగా పెరిగిపోతున్నాయా? అయితే మీరు కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ గురించి తెలుసుకోవాలి.
Service Charge: రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారా..? తిరిగిచ్చేయాల్సిందే..!
Restaurant Service Charge Rules India: బయట రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్లినప్పుడు రుచికరమైన భోజనం చేసి, బిల్లు చూశాక ఒక్కసారిగా షాక్ తింటున్నారా? మెనూ కార్డులో ఉన్న ధరల కంటే బిల్లులో అంకెలు భారీగా పెరిగిపోతున్నాయా? అయితే మీరు కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. చాలామంది సర్వీస్ ఛార్జ్ అంటే అది ప్రభుత్వం విధించే పన్ను ఏమో అనుకుని సైలెంట్‌గా కట్టేస్తుంటారు. కానీ, అది ముమ్మాటికీ తప్పు! మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ లేటెస్ట్ గైడ్‌లైన్స్ చదవాల్సిందే.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. సర్వీస్ ఛార్జ్ అనేది అస్సలు తప్పనిసరి కాదు. హోటళ్లు లేదా రెస్టారెంట్లు కస్టమర్ల అనుమతి లేకుండా వారి బిల్లులో సర్వీస్ ఛార్జీని చేర్చకూడదు.భోజనం చేసిన తర్వాత అక్కడి సర్వీసు పట్ల మీరు సంతృప్తి చెందితే, మీ ఇష్టపూర్వకంగా ఇచ్చేది మాత్రమే సర్వీస్ ఛార్జ్.దీనిని బలవంతంగా వసూలు చేయడం లేదా బిల్లులో ఆటోమేటిక్‌గా యాడ్ చేయడం చట్టవిరుద్ధం.
కొన్ని రెస్టారెంట్లు తెలివిగా సర్వీస్ ఛార్జ్ అనే పేరు తీసేసి.. స్టాఫ్ ఫండ్ , ఫెసిలిటీ ఛార్జ్ , లేదా అదర్ ఛార్జెస్ పేరుతో అదనపు బాదుడు బాదుతున్నాయి. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నిబంధనల ప్రకారం ఏ పేరుతో పిలిచినా, మెనూ ధర మరియు జీఎస్టీ (GST) కాకుండా అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది.
ఒకవేళ మీరు వెళ్లిన హోటల్‌లో సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిందేనని బలవంతం చేస్తే, మీరు కింది పద్ధతుల్లో ఫిర్యాదు చేయవచ్చు.నేరుగా 1915 నంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. కన్జూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి చెందిన 8800001915 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపవచ్చు. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఉన్నట్లుగా ఫోటో తీసుకుని ప్రూఫ్‌గా ఉంచుకోవాలి. ఇప్పటికే ముంబై, పట్నా వంటి నగరాల్లో ఇలా అక్రమంగా వసూలు చేసిన రెస్టారెంట్లకు కోర్టులు భారీ జరిమానాలు విధించాయి. కాబట్టి, నెక్స్ట్ టైం హోటల్‌కు వెళ్లినప్పుడు బిల్లును క్షుణ్ణంగా పరిశీలించండి. సర్వీస్ ఛార్జ్ పేరుతో మీ జేబును ఖాళీ చేసే ప్రయత్నం జరిగితే గళం విప్పండి.
రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవ పడటం కంటే, నిబంధనల గురించి వారికి వివరించడం ఉత్తమం. వారు వినకపోతే, బిల్లు చెల్లించి ఆ రసీదుతో ఫిర్యాదు చేస్తే.. సదరు రెస్టారెంట్‌కు కోర్టులు పెనాల్టీ విధించడమే కాకుండా, మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.