Tax Saving Scheme: పన్ను మినహాయింపునకి ఈ పథకం సూపర్.. చాలా డబ్బు ఆదా చేస్తారు..!
Tax Saving Scheme: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీ దగ్గర పడుతోంది.
Tax Saving Scheme: పన్ను మినహాయింపునకి ఈ పథకం సూపర్.. చాలా డబ్బు ఆదా చేస్తారు..!
Tax Saving Scheme: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే తేదీ దగ్గర పడుతోంది. మరోవైపు పాత పన్ను విధానం నుంచి ఆదాయపు పన్ను దాఖలు చేస్తే పన్ను ఆదా చేయడానికి కొన్ని పెట్టుబడులు చూపించవలసి ఉంటుంది. వీటి ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను ఆదా గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పన్ను ఆదా
తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. ఇది భవిష్యత్తు కోసం సంపదను కూడబెట్టుకోవడంలో సహాయపడుతుంది. పన్ను మినహాయింపు నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేస్తుంది. పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో అనేక ఎంపికలు ఉన్నాయి. ఇవి పన్ను ఆదా చేయడంలో సహాయపడతాయి. ఈ ఎంపికలలో PPF, NPS, ELSS నిధులు మొదలైనవి చెప్పవచ్చు.
పెట్టుబడి
చాలా మంది మొదటి జీతం వచ్చిన వెంటనే పొదుపు చేయడం ప్రారంభిస్తారు. పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలు దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇవి మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ లాభాలు అందిస్తాయి. పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలలో ELSS పథకం ఉత్తమైనదని చెప్పవచ్చు. దీని గురించి తెలుసుకుందాం.
ELSS ఫండ్‌లు
భవిష్యత్‌లో కొంచెం ముందుకు సాగడానికి, పన్ను సామర్థ్య పెట్టుబడి ఎంపికలను అన్వేషించాలనుకునే వారికి ELSS నిధులను ఉపయోగించి ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక పన్ను విధించదగిన ఆదాయం నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందవచ్చు.
లాక్ ఇన్ పీరియడ్
ELSS ఫండ్ అనేది ఈక్విటీ-ఆధారిత పథకం. దీనికి 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. 3 సంవత్సరాల కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేసిన తర్వాత సంపాదించిన మొత్తానికి ప్రభుత్వం 10% చొప్పున పన్ను విధిస్తుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక మూలధన లాభం వర్గంలోకి వస్తుంది.