Oil Price : భారీగా తగ్గిన కస్టమ్స్ డ్యూటీ.. త్వరలోనే తగ్గనున్న వంట నూనె ధరలు

Oil Price: త్వరలోనే వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. కొద్దికాలంగా ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలతో సామాన్యుడి బడ్జెట్ తారుమారైంది. 2024 సెప్టెంబర్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో కూడా నూనె ధరలు పెరిగాయి.

Update: 2025-06-12 09:34 GMT

Oil Price : భారీగా తగ్గిన కస్టమ్స్ డ్యూటీ.. త్వరలోనే తగ్గనున్న వంట నూనె ధరలు

Oil Price: త్వరలోనే వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. కొద్దికాలంగా ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలతో సామాన్యుడి బడ్జెట్ తారుమారైంది. 2024 సెప్టెంబర్‌లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో కూడా నూనె ధరలు పెరిగాయి. దీని ఫలితంగా వంటగదిలో ఉపయోగించే నూనె మరింత ప్రియం అయింది. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట నూనెల మీద విధించే కస్టమ్స్ డ్యూటీని 20% నుండి 10%కి తగ్గించింది. ఈ తగ్గింపు ముఖ్యంగా ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్ నూనెలపై వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ముడి నూనెలు, శుద్ధి చేసిన నూనెల మధ్య దిగుమతి సుంకం వ్యత్యాసం 8.75% నుంచి 19.25%కి పెరిగింది.

ముడి నూనెపై సుంకం ఎందుకు తగ్గించారు?

గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు తీవ్రంగా పెరిగాయి. 2024 సెప్టెంబర్‌లో దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. కానీ ఈ నిర్ణయం అనుకున్నదానికి విరుద్ధంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం, దేశీయంగా సుంకం పెంపు కలసి రావడంతో భారతదేశంలో వంట నూనె ధరలు మరింత పెరిగాయి. దీంతో సామాన్యుల బడ్జెట్ దెబ్బతింది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముడి వంట నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 20% నుండి 10%కి తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గింపు ముఖ్యంగా భారతదేశంలో విస్తృతంగా వినియోగించే ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్ నూనెలపై వర్తిస్తుంది. ఈ చర్య వల్ల నూనె ధరలు తగ్గుముఖం పట్టి, వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సుంకం తగ్గింపు ప్రయోజనం పూర్తిగా వినియోగదారులకు చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం వంట నూనె పరిశ్రమకు సంబంధించిన సంస్థలు, భాగస్వాములకు ఒక అడ్వయిజరీ జారీ చేసింది. దీనిలో నూనె ధరలను తగ్గించాలని, తద్వారా సామాన్యులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగాలని స్పష్టంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News