Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: 27 పాయింట్లు నష్టపోయి, 73,876 వద్ద ముగిసిన సెన్సెక్స్
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు స్వల్ప నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా ఎటువంటి సానుకూలతలు లేకపోవడంతో మార్కె్ట్లపై దాని ప్రభావం చూపింది. ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 27 పాయింట్లు నష్టపోయి.. 73 వేల 876 పాయింట్లకు పడిపోయింది. 18 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ... 22 వేల 434 వద్ద ముగిసింది.