Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: రూపాయి మారకం విలువ రెండు పైసలు పెరిగిందన్న నిపుణులు
Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయమే బలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. 489.57 పాయింట్ల లాభంతో సెన్సెక్స్..144.10 పాయింట్లు లాభంతో నిఫ్టీ జోష్ మీదున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు బలపడి 83.26 వద్ద నిలిచింది. అమెరికాలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు రేట్ల పెంపు ఇక ముగిసినట్లేననే సంకేతాలు ఫెడ్ నుంచి వచ్చాయి. మరోవైపు గత రెండు రోజుల వరుస నష్టాల నేపథ్యంలో కీలక కంపెనీల స్టాక్స్‌ను మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.