Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత కోటీ రూపాయలు రావాలా.. ఇలా చేస్తే సాధ్యమే..!

Retirement Plan: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు.

Update: 2023-11-28 13:00 GMT

Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత కోటీ రూపాయలు రావాలా.. ఇలా చేస్తే సాధ్యమే..!

Retirement Plan: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంతోకొంత పొదుపు చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తుంటే రిటైర్మెంట్‌ను మరింత మెరుగ్గా మార్చడానికి మంచి ఐడియా ఒకటి ఉంది. ఇందులో దీర్ఘ కాలికంగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిటైర్మెంట్‌ తర్వాత కోటి రూపాయల ఫండ్‌ను క్రియేట్‌ చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కోటి రూపాయల ఫండ్‌ క్రియేట్‌

నేటి కాలంలో తక్కువ రిస్క్‌తో డబ్బు సంపాదించడానికి మ్యూచువల్ ఫండ్స్ కంటే మరొకటి లేదు. ఈరోజు నుంచే SIPలో (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్) ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభిస్తే రిటైర్ అయ్యే సమయానికి కోటి రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి 12 శాతం వార్షిక రాబడిని అంచనా వేస్తే 10 సంవత్సరాల్లో రూ.1 కోటి కార్పస్‌ క్రియేట్‌ చేయడానికి ప్రతి నెలా దాదాపు రూ. 43,041 పెట్టుబడి పెట్టాలి.

ఒకవేళ 25 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించాలంటే ప్రతి నెలా రూ.5,270 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 12 శాతం వార్షిక రాబడి అనేది ఒక ఊహ మాత్రమే ఇది అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ఇది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీ ఫండ్ రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. SIPపై రాబడి స్థిరంగా ఉండదు. అయితే కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడం కంటే ఇది ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు. ఎందుకంటే షేర్లతో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News