DMart: డిమార్ట్‌లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్‌గా కొనొచ్చు?
డిమార్ట్ పేరు వింటేనే చౌకైన ధరలు గుర్తొస్తాయి. క్వాలిటీతో పాటు తక్కువ రేట్లలో సరుకులు అందించడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిమార్ట్‌కి అభిమానులు. కిరాణా సరుకుల నుంచి గృహోపకరణాల వరకు అందరికీ ఉపయోగపడే వస్తువులు ఇక్కడ సూపర్ డీల్స్‌లో దొరుకుతాయి.
DMart: డిమార్ట్‌లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్‌గా కొనొచ్చు?
డిమార్ట్ పేరు వింటేనే చౌకైన ధరలు గుర్తొస్తాయి. క్వాలిటీతో పాటు తక్కువ రేట్లలో సరుకులు అందించడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిమార్ట్‌కి అభిమానులు. కిరాణా సరుకుల నుంచి గృహోపకరణాల వరకు అందరికీ ఉపయోగపడే వస్తువులు ఇక్కడ సూపర్ డీల్స్‌లో దొరుకుతాయి. కానీ ప్రశ్న ఏమిటంటే — డిమార్ట్‌లో ఇంత తక్కువ ధరలకు ఎలా అమ్మగలుగుతున్నారు?
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు
డిమార్ట్ మధ్యవర్తులను తప్పించేస్తుంది. పెద్ద మొత్తంలో తయారీదారుల దగ్గరినుంచే సరుకులు కొనేస్తుంది. ఉదాహరణకి — టన్నుల కొద్దీ చక్కెర, వేల లీటర్ల నూనెలు ఒకేసారి కొనుగోలు చేస్తుంది. పెద్ద మొత్తంలో తీసుకుంటే ధర సహజంగానే తగ్గుతుంది.
డబ్బు వృథా కాకుండా స్టోర్ల నిర్వహణ
దుకాణాలపై ఖర్చు తక్కువ: చిన్న చిన్న షాపులు కాకుండా, పెద్ద స్టోర్లను అద్దెకు తీసుకుంటారు. దీర్ఘకాలంలో అద్దె ఖర్చులు తగ్గిపోతాయి.
తక్కువ శాశ్వత ఉద్యోగులు: ఎక్కువగా తాత్కాలిక సిబ్బందితో పనిచేయడం వల్ల జీతాల వ్యయం తగ్గుతుంది.
సింపుల్ డిజైన్: డిమార్ట్ స్టోర్లలో అదనపు అలంకరణలు ఉండవు. అవసరమైన వస్తువులు సులభంగా కనపడేలా ఉంచుతారు.
భారీ స్కేల్ = భారీ సేవింగ్స్
ప్రస్తుతం డిమార్ట్‌కి 12 రాష్ట్రాల్లో 415 స్టోర్లు ఉన్నాయి. ట్రక్కుల కొద్దీ సబ్బులు, బియ్యం, నూనె ఇలా పెద్ద మొత్తంలో ఆర్డర్లు వేస్తారు. అందుకే ధరలు మరింత తగ్గుతాయి.
వేగవంతమైన డెలివరీ సిస్టమ్
సెంట్రల్ గోడౌన్ల నుంచి సరుకులు నేరుగా స్టోర్లకు వస్తాయి. దాంతో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయి.
ఎవ్రీడే లో ప్రైస్ (EDLP)
డిమార్ట్‌లో ఇతర స్టోర్ల మాదిరిగా "సెల్స్" కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ తక్కువ ధరే. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం DMart Ready ద్వారా కూడా వస్తువులు కొంటే, ఎప్పుడూ MRPపై 7% తగ్గింపు దొరుకుతుంది.
ప్రజలకు కావాల్సిన వాటినే అమ్మడం
ప్రతి వస్తువు నిల్వలో ఉంచకుండా, ఎక్కువగా అమ్ముడయ్యే కిరాణా, సబ్బులు, గృహోపకరణాలపైనే ఫోకస్ పెడతారు. దీంతో అదనపు స్టాక్ ఖర్చు తగ్గుతుంది.
లాభాలను మళ్లీ వ్యాపారంలోనే పెట్టుబడి
2025లో డిమార్ట్ రూ.2,707 కోట్ల లాభం సాధించినా, వాటాదారులకు డివిడెండ్ ఇవ్వలేదు. కొత్త స్టోర్లు ప్రారంభించడానికి, వ్యాపారం విస్తరించడానికి వాడేసింది.
డిమార్ట్‌లో ఇంకా చవకగా కొనే టిప్స్
ప్రత్యేక ఆఫర్లున్న రోజుల్లో షాపింగ్ చేయండి
క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై వచ్చే క్యాష్‌బ్యాక్ డీల్స్ మిస్ కాకండి
తాజా ఆఫర్ల కోసం వెబ్‌సైట్ లేదా యాప్ చెక్ చేయండి
కాబట్టి, డిమార్ట్‌లో ప్రతిరోజూ ధరలు తక్కువగానే ఉంటాయి. కానీ ఆఫర్ డేస్‌లో షాపింగ్ చేస్తే మరింత చీప్‌గా సరుకులు కొనే అవకాశం ఉంటుంది!