Diwali Bank Offers: దీపావళి బ్యాంక్ ఆఫర్స్.. డిసెంబర్ 31 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు..!
Diwali Bank Offers: దీపావళి పండుగను పురస్కరించుకుని పలు బ్యాంకులు కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి.
Diwali Bank Offers: దీపావళి బ్యాంక్ ఆఫర్స్.. డిసెంబర్ 31 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు..!
Diwali Bank Offers: దీపావళి పండుగను పురస్కరించుకుని పలు బ్యాంకులు కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఒకవైపు ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ప్రజలను ఆకర్షించడానికి చౌకైన ఆఫర్లను ప్రకటించగా.. మరోవైపు బ్యాంకులు కూడా వివిధ రకాల రుణాలపై ఉపశమనం కల్పించాయి. పండుగ సీజన్‌లో దేశంలోని 3 అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్ల కోసం పండుగ ఒప్పందాలను ప్రవేశపెట్టాయి. టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో సహా దేశంలోని అనేక పెద్ద ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్‌లకు అనేక రకాల ఆఫర్‌లను అందిస్తున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దీపావళి ధమాకా 2023 పేరుతో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది. దీని కింద PNB కస్టమర్లు సంవత్సరానికి 8.4 శాతం తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీ ఉండదు. PNB నుంచి గృహ రుణం తీసుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇది కాకుండా PNB వెబ్‌సైట్ https://digihome.pnb.co.in/pnb/hl/ సందర్శించి హోమ్‌లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
SBI ఆఫర్
SBI ప్రత్యేక పండుగ ఆఫర్ సెప్టెంబర్ 1, 2023న ప్రారంభమైంది. డిసెంబర్ 31, 2023న ముగుస్తుంది. దీని కింద SBI కస్టమర్లకు వారి క్రెడిట్ బ్యూరో స్కోర్ ఆధారంగా టర్మ్ లోన్ వడ్డీ రేట్లపై భారీ డిస్కౌంట్లను ఇస్తుంది. ఎంత ఎక్కువ స్కోరు సాధిస్తే అంత సడలింపు ఇస్తారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 0.65 శాతం వరకు వడ్డీ రేటులో ఉపశమనం ఉంటుంది. ఉదాహరణకు SBI కస్టమర్ CIBIL స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే అతను 8.7% వడ్డీ రేటుతో టర్మ్ లోన్ పొందవచ్చు.
BOB ఆఫర్
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక పండుగ ఆఫర్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది. దీనికింద గృహ రుణ వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి మొదలవుతుంది. బ్యాంక్ ఎటువంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయదు. ఇది కాకుండా బ్యాంక్ కస్టమర్లు సంవత్సరానికి 8.7 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ కూడా తీసుకోవచ్చు. కార్, విద్యా రుణాలు రెండింటికీ BOB కస్టమర్‌లు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది.