Money Deposited: పొరపాటున డబ్బులు వేరొకరి ఖాతాలో జమ చేశారా.. వెంటనే ఇలా చేస్తే బెటర్..!

Money Deposited: పొరపాటున డబ్బులు వేరొకరి ఖాతాలో జమ చేశారా.. వెంటనే ఇలా చేస్తే బెటర్..!

Update: 2022-04-07 08:00 GMT

Money Deposited: పొరపాటున డబ్బులు వేరొకరి ఖాతాలో జమ చేశారా.. వెంటనే ఇలా చేస్తే బెటర్..!

Money Deposited: ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ఒక్కోసారి పొరపాటున డబ్బు వేరొకరి ఖాతాకు బదిలీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి.. ఆడబ్బు తిరిగి ఎలా పొందాలి. వాస్తవానికి ఇలా జరిగినప్పుడు వెంటనే సమాచారం బ్యాంకుకి తెలియజేయాలి. కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాలి. బ్యాంకు మిమ్మల్ని ఈ మెయిల్‌ చేయమని అడిగితే అందులో వివరంగా లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేయాలి. ట్రాన్జాక్షన్ జరిగిన తేదీ, సమయం, ఖాతా నంబర్, పొరపాటున డబ్బు బదిలీ అయిన ఖాతా నెంబర్ కచ్చితంగా తెలపాలి.

డబ్బు వేరొక ఖాతాకు బదిలీ అయితే తిరిగి పొందడానికి కొంత సమయం పట్టవచ్చు. మీరు ముందుగా బ్రాంచ్‌కి వెళ్లి దాని గురించి మేనేజర్‌కి చెప్పాలి. ఎందుకంటే ఏ నగరంలో ఏ శాఖలో ఏ ఖాతాకు డబ్బు బదిలీ అయిందో మీరు మీ బ్యాంకు ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఆ బ్రాంచ్‌ మేనేజర్‌తో మాట్లాడి మీ డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు. మీ సమాచారం ఆధారంగా పొరపాటున ఎవరి ఖాతాలో డబ్బు బదిలీ అయిందో బ్యాంక్ తెలియజేస్తుంది. దీని తర్వాత తప్పుగా బదిలీ అయిన డబ్బును తిరిగి ఇవ్వడానికి బ్యాంక్ ఆ వ్యక్తిని అనుమతి అడుగుతుంది.

ఒకవేళ సదరు వ్యక్తి ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. డబ్బు తిరిగి చెల్లించని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మీరు బ్యాంక్ ఖాతా నుంచి వేరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేసినప్పుడు మీకు ఒక మెస్సేజ్‌ వస్తుంది. లావాదేవీ తప్పుగా జరిగితే ఈ నంబర్‌కు మెసేజ్ పంపండి అని అందులో ఉంటుంది. పొరపాటున వేరొకరి ఖాతాలో డబ్బు జమ అయితే బ్యాంకులు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. వేరొకరి ఖాతాకి బదిలీ అయిన డబ్బుని తిరిగి ఇప్పించే బాధ్యత బ్యాంకులపై ఉంటుంది.

Tags:    

Similar News