ధరలు దిగొస్తున్నాయి.. దేశంలో భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువులు, వంటనూనెల ధరలు...

Cooking Oil Price: ద్రవ్యోల్బణం తగ్గించే దిశగా కేంద్రం కసరత్తు...

Update: 2022-05-25 07:43 GMT

ధరలు దిగొస్తున్నాయి.. దేశంలో భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువులు, వంటనూనెల ధరలు...

Cooking Oil Price: చమురు, వంటగ్యాసు ధరల నుంచి కాస్త ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం... వినియోగదారులకు మరో శుభవార్త వినిపించబోతోంది. దేశవ్యాప్తంగా ధరల నియంత్రణకు నడుం బిగించింది. పన్నులు తగ్గించేందుకు అవకాశం ఉన్న వస్తువుల జాబితా ఇవ్వాల్సిందిగా వాణిజ్యమంత్రిత్వశాఖకు ప్రధాని కార్యాలయం ఆదేశించింది. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా వంటనూనెల దిగుమతిపై సుంకం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.

ద్రవ్యోల్బణాన్ని మరింతగా తగ్గించగల చర్యలను కేంద్రం పరిశీలిస్తోంది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతులపై విధించే అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ లో కోత విధించాలని కూడా యోచిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 60-70 బేసిస్ పాయింట్లు తగ్గించడమే లక్ష్యంగా చర్యలకు ఉపక్రమించడం విశేషం. ఈ పరిశీలనల తరువాత కొన్ని నిత్యావసర వస్తువులు, వంటనూనెల ధరలు దిగొచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News