Rules Change from 1st March: మార్చి 1 నుండి మారనున్న రూల్స్ ఇవే

Rules Change from 1st March: ఫిబ్రవరి నెల ముగిసిపోతుంది. మార్చి నెల ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. కొత్త నెల ప్రారంభం నుండి చాలా రూల్స్ మారుతాయి.

Update: 2025-02-27 13:00 GMT

Rules Change from 1st March: మార్చి 1 నుండి మారనున్న రూల్స్ ఇవే

Rules Change from 1st March: ఫిబ్రవరి నెల ముగిసిపోతుంది. మార్చి నెల ప్రారంభం కావడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. కొత్త నెల ప్రారంభం నుండి చాలా రూల్స్ మారుతాయి. అదేవిధంగా, మార్చి 1, 2025 నుండి అనేక రూల్స్ మారబోతున్నాయి. ఇది మీ జేబును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏ మార్పులు జరుగుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫిక్స్ డ్ డిపాజిట్

చాలా మంది వారు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెట్టుబడి పెడుతుంటారు. మార్చి 2025 నుండి బ్యాంక్ FD నియమాలలో కొన్ని ప్రధాన మార్పులు చేశారు. ఈ కొత్త నియమాలు మీ రాబడిని ప్రభావితం చేయడమే కాకుండా మీ పన్ను, విత్ డ్రా పద్ధతులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, మీరు భవిష్యత్తులో ఎఫ్ డీ చేయాలని ఆలోచిస్తుంటే ఈ మార్పులను అర్థం చేసుకోవాలి.

ఎఫ్ డీ పై వడ్డీ రేట్లలో మార్పు

మార్చి 2025 నుండి బ్యాంకులు ఎఫ్ డీ పై వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేశాయి. వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇప్పుడు బ్యాంకులు వాటి లిక్విడిటీ, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో ఫ్లెక్సిబిలిటీను కొనసాగించవచ్చు. చిన్న పెట్టుబడిదారులపై, ముఖ్యంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్ డీలు చేసిన వారిపై కొత్త రేట్లు ప్రభావం చూపవచ్చు. చిన్న పెట్టుబడిదారులపై 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్ డీలు చేసిన వారిపై కొత్త రేట్లు ప్రభావం చూపవచ్చు.

ఎల్ పీజీ ధర

చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎల్ పీజీ ధరలను సమీక్షిస్తాయి. మార్చి 1, 2025 తెల్లవారుజామున సిలిండర్ ధరలలో మార్పును చూడవచ్చు. సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏటీఎఫ్ రేట్లు

ప్రతి నెలా 1వ తేదీన చమురు కంపెనీలు విమాన ఇంధనం ధరలను అంటే ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF), CNG-PNG ధరలను కూడా మారుస్తాయి.

Tags:    

Similar News