Nirmala Sitharaman: బడ్జెట్ 2026.. కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. సంస్కృతి చాటుతూనే పొలిటికల్ సిగ్నల్?
Nirmala Sitharaman: బడ్జెట్ 2026 వేళ నిర్మలా సీతారామన్ కాంజీవరం చీరలో మెరిశారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ భారతీయ సంస్కృతిని చాటారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ లుక్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Nirmala Sitharaman: బడ్జెట్ 2026.. కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. సంస్కృతి చాటుతూనే పొలిటికల్ సిగ్నల్?
Nirmala Sitharaman: దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న ఆమె, ఈ కీలక తరుణంలో కాంజీవరం పర్పుల్ కాటన్ సిల్క్ చీరను ధరించి పార్లమెంటుకు చేరుకున్నారు.
తమిళనాడు ఎన్నికల కనెక్షన్?
నిర్మలా సీతారామన్ గారు ధరించిన ఈ కాంజీవరం చీర వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన కాంజీవరం వస్త్రాన్ని ధరించడం ద్వారా కీలక సంకేతాలు ఇచ్చారని చర్చ జరుగుతోంది.
గత బడ్జెట్లలో నిర్మలమ్మ 'లుక్స్' ఇవే:
భారతీయ చేనేత కళలను ప్రోత్సహించేలా ఆమె గతంలోనూ వివిధ రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ఎంచుకున్నారు:
| సంవత్సరం | చీర రకం / ప్రత్యేకత | రాష్ట్రం/సంస్కృతి |
| 2026 | పర్పుల్ కాంజీవరం కాటన్ సిల్క్ | తమిళనాడు |
| 2024 | మధుబని ప్రింట్ ఆఫ్-వైట్ హ్యాండ్లూమ్ | బీహార్ |
| 2024 (Interim) | నీలి రంగు టస్సర్ సిల్క్ (కాంత వర్క్) | పశ్చిమ బెంగాల్ శైలి |
| 2023 | ఎరుపు-నలుపు కాసుతి ఎంబ్రాయిడరీ | కర్ణాటక |
చేనేత కళకు బడ్జెట్ బ్రాండింగ్: సాధారణంగా బడ్జెట్ రోజున నిర్మలమ్మ ధరించే చీర ఏ ప్రాంతానికి చెందిందనేది దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది. హ్యాండ్లూమ్ రంగంపై ఆమెకు ఉన్న మక్కువను ఇది చాటిచెబుతోంది. ఈసారి పర్పుల్ రంగు కాంజీవరం చీరలో ఆమె హుందాగా కనిపిస్తూ డిజిటల్ ట్యాబ్ (Bahi Khata) పట్టుకుని లోక్‌సభలోకి అడుగుపెట్టారు.