మార్కెట్లలో ‘బ్లాక్ ఫ్రైడే’ భీభత్సం: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి!
Stock Market: స్టాక్ మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి రిస్క్ కొనసాగుతుందనే అంచనాలతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Stock Market: స్టాక్ మార్కెట్లలో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి రిస్క్ కొనసాగుతుందనే అంచనాలతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎఫ్ఐఐలు సెల్లింగ్ కు దిగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. మరోవైపు రూపాయి విలువ ఆల్ టైం కనిష్ట స్ధాయికి చేరింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 90.92కి దిగజారింది. మొత్తంమీద సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 పాయింట్ల వద్ద ముగియగా 241 పాయింట్లు పతనమైన నిఫ్టీ 25,048 పాయింట్ల వద్ద క్లోజయింది.