Toll System: టోల్ కష్టాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం.. త్వరలో బారియర్ లెస్ టోల్ సిస్టం..!
Toll System: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Toll System: టోల్ కష్టాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం.. త్వరలో బారియర్ లెస్ టోల్ సిస్టం..!
Toll System: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ మేరకు టోల్ ప్లాజా వద్ద పొడవైన క్యూలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రోడ్డు రవాణా, రహణా శాఖ సహాయ మంత్రి (MoS) వీకే సింగ్ తెలిపారు. ప్రభుత్వం త్వరలో అడ్డంకులు లేని టోలింగ్ విధానాన్ని ప్రారంభించబోతోందని ఆయన అన్నారు.
టోల్ ప్లాజా వద్ద పొడవైన క్యూలకు చెక్..
ప్రభుత్వం త్వరలో అడ్డంకులు లేని టోల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నందున ప్రయాణికులు ఇకపై టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు. బారియర్-లెస్ టోలింగ్ సిస్టమ్ ట్రయల్ జరుగుతోందని, మా ట్రయల్ విజయవంతమైన వెంటనే అమలు చేస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం తెలిపారు.
ప్రయాణించిన కిలోమీటర్ల ఆధారంగా దేశంలో చెల్లింపు విధానాన్ని అనుసరించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కొత్త టోల్లింగ్ విధానంతో సామర్థ్యం మెరుగుపడుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందని వీకే సింగ్ తెలిపారు.
శాటిలైట్, కెమెరా ఆధారితంగా..
ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ వ్యవధిని 47 సెకన్లకు తగ్గించడంలో సహాయపడిందని, అయితే దీనిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వీకే సింగ్ చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై పైలట్ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కొన్ని ఉపగ్రహ, కెమెరా ఆధారిత విధానాలను పరీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
హైవేలోకి ప్రవేశించిన వెంటనే, వాహనం రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా ద్వారా స్కాన్ చేసి, డేటాను సేకరించిన వెంటనే, ప్రయాణించిన కిలోమీటరుకు ఛార్జీ విధించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మీరు రూ. 265 చెల్లిస్తారనుకుంటే.. అప్పుడు ప్రయాణించిన కిలోమీటరుతో దానికి ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.
ఇది (చెల్లింపు) టోల్ నియమంపై ఆధారపడి ఉంటుంది. టెలికాం సహా అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి ప్రగతి అంతా జరుగుతున్నదని, టెలికాం రంగం అన్ని రంగాలతో ముడిపడి ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికాం నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు.