Cigarette Prices Hike: పొగరాయుళ్ళూ.. సిగరెట్టు ముట్టుకుంటే జేబు ఖాళీ.. ఎలానో చూడండి!

Cigarette Prices Hike: సిగరెట్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం కింగ్ సైజ్ షాక్ ఇచ్చింది. గతేడాది సెప్టెంబరులో మోదీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఇప్పుడు పొగ చూపిస్తున్నాయి.

Update: 2026-02-19 05:04 GMT

Cigarette Prices Hike: పొగరాయుళ్ళూ.. సిగరెట్టు ముట్టుకుంటే జేబు ఖాళీ.. ఎలానో చూడండి!

Cigarette Prices Hike: సిగరెట్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం కింగ్ సైజ్ షాక్ ఇచ్చింది. గతేడాది సెప్టెంబరులో మోదీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఇప్పుడు పొగ చూపిస్తున్నాయి. సామాన్యుడు వాడే వస్తువులపై పన్నులు తగ్గించి ఊరటనిచ్చిన ప్రభుత్వం, పొగాకు ఉత్పత్తుల విషయంలో మాత్రం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ శ్లాబులను హేతుబద్ధీకరిస్తూ 12, 28 శాతం శ్లాబులను రద్దు చేసిన కేంద్రం.. సిగరెట్లు, పాన్ మసాలా వంటి వాటిపై జీఎస్టీని ఏకంగా 28 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. దీనికి అదనంగా భారీ ఎత్తున ఎక్సైజ్ డ్యూటీని కూడా జోడించింది. ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలతో సిగరెట్ మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది.

ప్రభుత్వ నిర్ణయంతో ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీలు ధరల భారాన్ని కస్టమర్ల మీదకు నెట్టేశాయి. పెరిగిన ధరలు చూస్తుంటే దమ్ము కొట్టాలంటేనే గుండె గుభేల్ మనేలా ఉంది.

గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం: 10 స్టిక్స్ ప్యాకెట్ ధర రూ. 170 నుంచి రూ. 240 కి పెరిగింది. అంటే ఒక్కో సిగరెట్‌పై ఏకంగా రూ. 7 భారం పడింది.

క్లాసిక్ (20s) ప్యాక్: రూ. 340 ఉన్న ధర ఇప్పుడు రూ. 480 కి చేరింది.

విల్స్ నేవీ కట్: రూ. 95 నుండి రూ. 120 కి పెరిగింది.

క్లాసిక్ కనెక్ట్ (స్లిమ్స్): దీని ధర 20 శాతం పెరిగి రూ. 360 కి చేరింది.

పన్నుల భారం పెరిగినా తమ లాభాలకు గండి పడకుండా ఉండేందుకు కంపెనీలు 19 శాతం నుండి 41 శాతం వరకు ధరలను పెంచేశాయి. ఐటీసీ బాటలోనే గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ వంటి ఇతర కంపెనీలు కూడా పయనిస్తున్నాయి. ఈ ధరల పెంపు వార్తలతో స్టాక్ మార్కెట్‌లో ఐటీసీ షేరు కూడా లాభాల్లో దూసుకుపోతోంది. మొత్తానికి, ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా వదలలేని వారికి, ఇప్పుడు సిగరెట్ ఆర్థికంగా కూడా హానికరంగా మారింది. దమ్ము కొట్టే ముందు ఒకటికి రెండుసార్లు జేబు వైపు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Tags:    

Similar News