Unemployment: ఇది విన్నారా..! భారత్‌లో నిరుద్యోగం ఎంత ఉందో తెలుసా..?

Unemployment: దేశ ఆర్థిక గమనంలో కీలకమైన శ్రామిక శక్తి మార్కెట్ నుంచి తాజా గణాంకాలు వెలువడ్డాయి. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ (PLFS) సర్వే ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి చేరుకుంది.

Update: 2026-02-17 03:09 GMT

Unemployment: ఇది విన్నారా..! భారత్‌లో నిరుద్యోగం ఎంత ఉందో తెలుసా..?

Unemployment: దేశ ఆర్థిక గమనంలో కీలకమైన శ్రామిక శక్తి మార్కెట్ నుంచి తాజా గణాంకాలు వెలువడ్డాయి. గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ (PLFS) సర్వే ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 5 శాతానికి చేరుకుంది. గణాంకాల పరంగా ఇది స్వల్ప మార్పులా అనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను ఇది ప్రతిబింబిస్తోంది.

గ్రామాల్లో ఎందుకు పెరిగింది?

సాధారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. శీతాకాలం ముగిసే సమయానికి పంట కోతలు పూర్తవుతాయి. ఆ తర్వాత కొత్త పంట సాగుకు మధ్య ఉండే 'విరామ సమయం' (Gap period) వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గుతుంది. దీనికి తోడు చలితీవ్రత వల్ల నిర్మాణ రంగ పనులు కూడా మందగించాయి. డిసెంబర్‌లో: 3.9 శాతం,జనవరిలో: 4.2 శాతంగా నమెదు చేశాయి.

పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి

పట్టణాల్లోనూ నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి ఎగబాకింది. సేవా రంగం మరియు చిన్న తరహా పరిశ్రమల్లో నెలకొన్న మార్పులు ఈ పెరుగుదలకు కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.గ్రామీణ మహిళల భాగస్వామ్యం: 39.7%,పట్టణ మహిళల భాగస్వామ్యం: 25.5%గా నమోదైంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో మహిళలు ఎక్కువగా ఉపాధి పనుల్లో (ప్రధానంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు) పాల్గొంటున్నారని ఈ డేటా చెబుతోంది.

ఈ పెరుగుదల ప్రధానంగా సీజనల్ ప్రభావమేనని మంత్రిత్వ శాఖ పేర్కొన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. వాతావరణం మారి, వేసవి పనులు ప్రారంభమైతే ఈ రేటు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News