AC Price: ఎండలే కాదు.. ఏసీ ధరలు కూడా పెరుగుతున్నాయ్..ఇప్పుడే కొనేయండి

AC Price: వేసవి కాలం రానే వచ్చింది.. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడు ఏసీల వైపు మళ్లుతోంది.

Update: 2026-02-18 04:30 GMT

AC Price: ఎండలే కాదు.. ఏసీ ధరలు కూడా పెరుగుతున్నాయ్..ఇప్పుడే కొనేయండి

AC Price: వేసవి కాలం రానే వచ్చింది.. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అందరి చూపు ఇప్పుడు ఏసీల వైపు మళ్లుతోంది. అయితే, ఈసారి చల్లని గాలి కోసం జేబులు గట్టిగా ఖాళీ చేసుకోవాల్సిందేనని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కొత్త ఏసీ కొనాలనుకునే వారికి కంపెనీలు గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ప్రముఖ ఏసీ తయారీ సంస్థ బ్లూస్టార్ ఇప్పటికే ధరల పెంపుపై స్పష్టమైన సంకేతాలిచ్చింది.

ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ త్రైమాసికంలో ఏసీ ధరలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. దీనికి దారితీసిన పరిస్థితులు ఇవే.ఏసీ తయారీలో కీలకమైన రాగి వంటి లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతంగా పెరిగాయి.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు భారమైంది.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంధన-సామర్థ్య లేబులింగ్ నిబంధనల వల్ల తయారీ వ్యయం పెరిగింది. స్టార్ రేటింగ్‌ను బట్టి అదనంగా 5-10 శాతం భారం పడనుంది.

సాధారణంగా ఏసీ కంపెనీలు 8 నుంచి 10 శాతం అతి తక్కువ లాభాల మార్జిన్‌తో నడుస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ముడిసరుకు వ్యయాన్ని కంపెనీలే భరిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఆ అదనపు భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. మెరుగైన డిజైన్, టెక్నాలజీతో ఖర్చు తగ్గించాలని చూసినా, ప్రస్తుత మార్కెట్ ఒత్తిడి ముందు అవి పనిచేయడం లేదు. మీరు ఈ వేసవికి కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ధరలు మరింత పెరగకముందే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఎండలతో పాటు ఏసీల రేట్లు కూడా పోటీ పడి పెరగనున్నాయి.

Tags:    

Similar News