Bank Holidays: ఈ వారం బ్యాంకులకు భారీగా సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
Bank Holidays: 2025 జూన్‌లో కూడా బ్యాంక్ సెలవులు ఉండటంతో, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందే చేసుకోవడం చాలా అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, జాతీయ, ప్రాంతీయ పండుగల ఆధారంగా ప్రతి సంవత్సరం బ్యాంకులు కొన్ని రోజులు మూసి ఉంటాయి.

జూన్ 16 నుంచి నెలాఖరు వరకూ సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని మీ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోండి.
ప్రధాన సెలవులు ఇవే
* జూన్ 22 (ఆదివారం): అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి – సాధారణ వీకెండ్ సెలవు
* జూన్ 28 (నాల్గో శనివారం): బ్యాంకులకు సెలవు – RBI రూల్స్ ప్రకారం
* జూన్ 27: ఒడిశా, మణిపూర్‌లో రథయాత్ర సందర్భంగా బ్యాంకులు పనిచేయవు
* జూన్ 30: మిజోరాంలో రెమ్నానీ అనే ప్రత్యేక సెలవు ఉంటుంది
ఇవి కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు కారణంగా బ్యాంకులు పనిచేయవు. అందుకే మీ స్టేట్‌కు సంబంధించి సెలవుల లిస్ట్‌ను తెలుసుకోవడం ఉత్తమం.
జూన్ నెలలో మొత్తం ఎంతమంది రోజులు బ్యాంకులు పనిచేయవు?
జూన్ 2025లో దేశవ్యాప్తంగా సుమారు 12 రోజులు బ్యాంకులు పూర్తిగా లేదా కొన్ని ప్రాంతాల్లో పనిచేయవు.
వీటిలో ప్రధానంగా:
ఆదివారాలు – 4
రెండవ, నాల్గవ శనివారాలు – 2
పండుగల కారణంగా ప్రాంతీయ సెలవులు – 6 (రాష్ట్రాలను బట్టి మారవచ్చు)
కీలక ప్రాంతీయ సెలవులు – రాష్ట్రాల వారీగా
* జూన్ 7 దేశవ్యాప్తంగా బక్రీద్ (ఈద్-ఉల్-జుహా)
* జూన్ 11న సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లో సంత్ గురు కబీర్ జయంతి, సాగా దవా సందర్భంగా.
* జూన్ 27న ఒడిశా, మణిపూర్ రథయాత్ర సందర్భంగా.
* జూన్ 30న మిజోరాంలో రెమ్నా నీ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకులు మూసి ఉన్నా ఈ సేవలు ఉంటాయి.
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. అందుకే కస్టమర్లు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. వీటిలో ప్రధానంగా యూపీ, IMPS సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి ఏటీఎమ్ విత్‌డ్రా, ఆన్‌లైన్ క్యాష్ పేమెంట్స్ నిరంతరం పనిచేస్తాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా బిల్లుల చెల్లింపు, ఫండ్ ట్రాన్స్‌ఫర్ మొదలైనవి ఉండనే ఉన్నాయి.