IT News: ఉద్యోగులకు షాక్.. 800మందిని తీసేసిన ప్రముఖ కంపెనీ!
IT News: కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించిన విచారణలో సంస్థ విధిగా తన విధానాలను పాటించిందని ఇన్ఫోసిస్ వివరణ ఇచ్చింది.
IT News: ఉద్యోగులకు షాక్.. 800మందిని తీసేసిన ప్రముఖ కంపెనీ!
IT News: ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో మరోసారి భారీగా ట్రైనీలను తొలగించింది. 680 మంది ట్రైనీల బ్యాచ్‌లో 195 మంది ఇంటర్నల్ అసెస్మెంట్స్‌లో ఫెయిలయ్యారని వెల్లడైంది. ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో సుమారు 800 మందిని సంస్థ తొలగించింది. వీరిలో 250 మంది ఉప్‌గ్రాడ్, ఎన్‌ఐఐటీ వంటి సంస్థలతో కలసి అందించే స్కిల్స్ ట్రైనింగ్‌కు చేరగా, 150 మంది అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలకు నమోదు చేసుకున్నారు.
ఇన్ఫోసిస్ తాజాగా ఉప్‌గ్రాడ్, ఎన్‌ఐఐటీతో భాగస్వామ్యం ఏర్పరిచి ట్రైనీలకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. ముఖ్యంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM), ఐటీ రంగాల్లో శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించాయి. కొంతమందికి ఆలస్యంగా చేరిక జరిగిన నేపథ్యంలో 12 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి BPM విభాగంలో పనిచేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. వీరికి రిలీవింగ్ లెటర్‌తో పాటు ఒక నెల సాలరీ అదనంగా చెల్లించనుంది.
BPM మార్గాన్ని ఎంచుకోని వారిని బెంగళూరు నగరానికి తరలించేందుకు సంస్థ ప్రత్యేకంగా ట్రావెల్ సదుపాయాలను కల్పించింది. మైసూరులోని ఎంప్లాయీ కేర్ సెంటర్‌లో తాత్కాలిక వసతిని కూడా అందిస్తోంది. దీనితోపాటు స్వగ్రామాలకు తిరిగి వెళ్లే ఖర్చులను కూడా సంస్థ భరిస్తోంది. కంపెనీ ఆదాయం వృద్ధి రేటు ప్రస్తుతం 0 నుంచి 3 శాతం మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మార్కెట్ డిమాండ్ బలహీనంగా ఉన్నప్పుడు తీసుకున్న ఈ చర్యలు కీలకంగా మారాయి. సంస్థ విధానాల ప్రకారం అసెస్మెంట్లలో అర్హత సాధించని ట్రైనీలను కొనసాగించలేమని చెబుతోంది.
ఈ వ్యవహారంపై కర్ణాటక లేబర్ డిపార్ట్మెంట్ విచారణ జరిపి, సంస్థ ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు చేయలేదని నిర్ధారించింది. ట్రైనీలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్‌గా నమోదు అయ్యారని, కాబట్టి ఉద్యోగాల తొలగింపుపై వర్తించే చట్టాలు వారికి వర్తించవని చెప్పింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించిన విచారణలో సంస్థ విధిగా తన విధానాలను పాటించిందని ఇన్ఫోసిస్ వివరణ ఇచ్చింది.