Recovery Agents Harassing: లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..!
Recovery Agents Harassing: ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటారు.
Recovery Agents Harassing: లోన్ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా.. ఇక్కడ ఫిర్యాదు చేయండి..!
Recovery Agents Harassing: ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకుంటారు. సరైన సమయంలో చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్ల భారినపడుతారు. వీరి వేధింపులు భరించలేక ఇటీవల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. లోన్ రికవరీ పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిపై ఫిర్యాదు చేసే హక్కును కల్పించింది. తద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
పెరిగిన కేసుల సంఖ్య
ఈ మధ్య కాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎక్కువయ్యాయి. కొవిడ్ సమయంలో బ్యాంకులు కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ ఇప్పుడు మళ్లీ వసూళ్ల వేట మొదలైంది. రుణాలని వసూలు చేయాలంటే ఏజెంట్లకి ఆదేశాలు జారీ కావడంతో వీళ్ల కస్టమర్లపై ఒత్తిడి పెంచుతూ వారిని వేధింపులకి గురిచేస్తున్నారు.
ఎవరు బాధ్యులు
లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించి ఆర్‌బీఐ సరైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ గైడ్‌లైన్ ప్రకారం వేధింపులకు పాల్పడే వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి అనుబంధంగా ఉన్న బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. అందుకే బ్యాంకులు లోన్ రికవరీ ఏజెంట్లకు మానసికంగా లేదా శారీరకంగా ఏ రూపంలోనూ కస్టమర్లతో అనుచితంగా ప్రవర్తించకూడదని చెప్పాలి.
ఎలా ఫిర్యాదు చేయాలి..?
లోన్ రికవరీ కేసుల్లో బాధితులుగా ఉండాలంటే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఒకవేళ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరిస్తే ఆ బ్యాంకుపై కోర్టులో సివిల్ ఇంజక్షన్ దాఖలు చేయాలి. దీని కారణంగా బాధిత వ్యక్తిని కోర్టు విచారిస్తుంది. పరువు నష్టం కోసం పరిహారం కూడా అందేలా చేస్తుంది. ఇది కాకుండా ఏజెంట్ల కాల్ రికార్డ్‌లు, SMS, ఇ-మెయిల్‌లను ట్రాక్ చేయవచ్చు. మీ ఫిర్యాదును నేరుగా సంబంధిత బ్యాంక్ అధికారికి కూడా తెలియజేయవచ్చు.