Stock Market: 8రోజుల వరుస నష్టాలకు బ్రేక్
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 8రోజుల వరుస నష్టాలకు బ్రేక్
Stock Market: 8రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు బయటపడ్డాయి. బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు అదే జోరు కొనసాగించింది. బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 448 పాయింట్ల లాభంతో 59వేల 411 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 146 పాయింట్లు లాభ పడి 17వేల 450 పాయింట్ల వద్ద ముగిసింది.