Volkswagen: ప్రీమియం ఎస్‌యూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వోక్స్ వ్యాగన్ కార్లపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.లక్ష కంటే ఎక్కువే..!
Volkswagen: మార్చి 2024లో Virtus, Taigun SUVలతో సహా కొన్ని మోడల్ శ్రేణులపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
Volkswagen: ప్రీమియం ఎస్‌యూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వోక్స్ వ్యాగన్ కార్లపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.లక్ష కంటే ఎక్కువే..!
Volkswagen: మార్చి 2024లో Virtus, Taigun SUVలతో సహా కొన్ని మోడల్ శ్రేణులపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ ప్రయోజనాలు నగదు తగ్గింపు, కార్పొరేట్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో ఇస్తోంది. ఇవి ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
మార్చి 2024లో Volkswagen Virtusపై ఆఫర్‌లు..
ఈ నెల, వోక్స్‌వ్యాగన్ తన వర్టస్ మోడల్‌పై మొత్తం రూ.75,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.
మార్చి 2024లో వోక్స్‌వ్యాగన్ టైగన్‌పై తగ్గింపు ఎంతంటే?
టైగన్ SUVపై గరిష్టంగా రూ. 1.30 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. రూ.60,000 వరకు నగదు తగ్గింపు, రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.30,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది.
స్టాక్ లభ్యత, వేరియంట్, లొకేషన్, డీలర్‌షిప్, రంగు, ఇంజిన్, ఇతర కారకాలపై ఆధారపడి ఈ ఆఫర్‌లు మారవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీప అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.