Toyota Ebella EV : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిమీ రేంజ్‌..టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ విస్ఫోటనం

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిమీ రేంజ్‌..టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ విస్ఫోటనం

Update: 2026-01-27 04:00 GMT

Toyota Ebella EV : జపనీస్ ఆటో దిగ్గజం టయోటా ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందినప్పటికీ, టోయొటా తనదైన సిగ్నేచర్ స్టైల్, లగ్జరీ ఫీచర్లతో దీనిని ముస్తాబు చేసింది. అదిరిపోయే రేంజ్, అదిరిపోయే లుక్స్‌తో వస్తున్న ఈ ఈవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను మొత్తం మూడు వేరియంట్లలో కంపెనీ పరిచయం చేసింది. అవి E1, E2, E3. మధ్యతరగతి నుంచి ప్రీమియం కస్టమర్ల దాకా అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేరియంట్లను డిజైన్ చేశారు. దీని బేస్ వేరియంట్ E1 బడ్జెట్ ధరలో లభిస్తుండగా, టాప్ వేరియంట్ E3లో అత్యాధునిక లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV ధర సుమారు రూ.19 లక్షల నుంచి రూ.24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఇప్పటికే రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఎలక్ట్రిక్ కార్లలో కస్టమర్లు ప్రధానంగా చూసేది రేంజ్. ఈ విషయంలో ఎబెల్లా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫుల్ ఛార్జ్‌పై ఇది ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సిటీలోనే కాకుండా దూర ప్రయాణాలకు కూడా ఇది ది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. బ్యాటరీపై టయోటా ఏకంగా 8 ఏళ్ల వారంటీ ఇస్తోంది. అంతేకాకుండా, కారు రీసేల్ విలువ పడిపోకుండా ఉండేందుకు 60 శాతం బైబ్యాక్ అస్యూరెన్స్, బ్యాటరీ ధరను విడిగా చెల్లించే BaaS ప్రోగ్రామ్‌లను కూడా ఆఫర్ చేస్తోంది.

ఎబెల్లా మొత్తం 9 ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. అందులో 5 సింగిల్-టోన్ రంగులు (రెడ్, వైట్, సిల్వర్, గ్రే, బ్లాక్) ఉండగా, 4 డ్యూయల్-టోన్ రంగులు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ కలర్ డ్యూయల్-టోన్ ఆప్షన్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ADAS వంటి హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV రాకతో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీ ఎదురుకానుంది.

Tags:    

Similar News