Tata : టాటా హారియర్, సఫారీ కొత్త మోడల్స్: తక్కువ ధరలో టాప్ ఫీచర్లు!
Tata: టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీలు అయిన హారియర్, సఫారీ కోసం రెండు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లకు అడ్వెంచర్ X అని పేరు పెట్టారు.
Tata : టాటా హారియర్, సఫారీ కొత్త మోడల్స్: తక్కువ ధరలో టాప్ ఫీచర్లు!
Tata: టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీలు అయిన హారియర్, సఫారీ కోసం రెండు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌లకు అడ్వెంచర్ X అని పేరు పెట్టారు. ఈ కొత్త మోడల్స్, తక్కువ ధరలో టాప్ మోడల్స్‌లో ఉండే అడ్వాన్సుడ్ ఫీచర్లను అందిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు బయట మోడిఫికేషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ధర విషయానికి వస్తే.. టాటా హారియర్ అడ్వెంచర్ X రూ.18.99 లక్షలు, టాటా హారియర్ అడ్వెంచర్ X+ రూ.19.34 లక్షలు, టాటా సఫారీ అడ్వెంచర్ X+ రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
టాటా మోటార్స్ హారియర్, సఫారీ వేరియంట్లను 11 నుంచి 6కు తగ్గించింది. కొత్తగా విడుదలైన అడ్వెంచర్ X, X+ మోడల్స్, తక్కువ ధరలో టాప్-స్పెక్ వేరియంట్ల ఫీచర్లను అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు అదనంగా డబ్బు ఖర్చుపెట్టి బయట మోడిఫికేషన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త మోడల్స్ కొత్త సీవీడ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో పాటు మరో 6 కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, లెదరైట్ అప్హోల్స్ట్‌రీ, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన లెవల్-2 ADAS,
360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు ఆటో హోల్డ్ ఫీచర్ ఉంటాయి. అంతే కాకుండా ట్రైల్ రెస్పాన్స్ మోడ్స్ (నార్మల్, రఫ్, వెట్), ల్యాండ్ రోవర్ నుంచి తీసుకున్న మోనో-షిఫ్టర్ కూడా ఉంటుంది.
హారియర్ అడ్వెంచర్ Xలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వెంచర్ X+లో ఈ ఫీచర్లతో పాటు లెవల్-2 ADAS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్‌లు అదనంగా లభిస్తాయి. అడ్వెంచర్ X+ ధర అడ్వెంచర్ X కంటే కేవలం రూ.34,000 మాత్రమే ఎక్కువ.
కొత్త సఫారీ అడ్వెంచర్ X+లో కూడా అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త సూపర్నోవా కాపర్ కలర్‌తో పాటు అడ్వెంచర్ ఓక్ ఇంటీరియర్. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, లైట్ బ్రౌన్ లెదర్ అప్హోల్స్ట్‌రీ, లెవల్-2 ADAS, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.
టాటా హారియర్, సఫారీ అడ్వెంచర్ X రెండింటిలోనూ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 168 బీహెచ్‌పీ పవర్‌ను, 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా, టాటా ప్యూర్ X అనే కొత్త వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ స్మార్ట్ వేరియంట్ (రూ.15 లక్షలు) కంటే కొంచెం ఎక్కువ ధరతో రూ.17.99 లక్షలకు లభిస్తుంది.