Volkswagen : తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది..జర్మన్ ఇంజనీరింగ్ దెబ్బకు క్రెటా, సెల్టోస్ అబ్బా అనాల్సిందే

తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది..జర్మన్ ఇంజనీరింగ్ దెబ్బకు క్రెటా, సెల్టోస్ అబ్బా అనాల్సిందే

Update: 2026-01-31 05:40 GMT

Volkswagen : జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్ వ్యాగన్ భారత మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా తన పాపులర్ మోడల్స్ అయిన టైగూన్, వర్టస్ కార్లను మరింత పవర్ఫుల్ గా మార్చబోతోంది. 2026లో రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలో మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను జోడించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. భారతీయ వాహనదారులకు సేఫ్టీతో కూడిన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో ఫోక్స్ వ్యాగన్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు అదే నమ్మకాన్ని మరింత పెంచేందుకు, తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగూన్, సెడాన్ వర్టస్ కార్లలో అడాస్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీ కార్లన్నీ అడాస్ ఫీచర్లతో వస్తుండటంతో, ఫోక్స్ వ్యాగన్ కూడా తన టాప్ వేరియంట్లలో ఈ అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను అందించబోతోంది. 2026లో రాబోయే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కేవలం సేఫ్టీ మాత్రమే కాకుండా, డిజైన్ పరంగా కూడా సరికొత్తగా ఉండబోతున్నాయి.

ఫోక్స్ వ్యాగన్ తన ప్రీమియం మోడల్స్ అయిన టిగువాన్ ఆర్-లైన్, టేరాన్ వంటి అంతర్జాతీయ మోడల్స్ లో ఇప్పటికే అడాస్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అదే టాప్-డౌన్ అప్రోచ్‌తో ఈ ఫీచర్లను ఇండియాలోని మోడల్స్ కు తీసుకురానుంది. ఇందులో భాగంగా లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ లో డ్రైవర్ పై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఈ సాంకేతిక మార్పుల కోసం ఫోక్స్ వ్యాగన్ తన సిస్టర్ కంపెనీ అయిన స్కోడాతో కలిసి పనిచేస్తోంది. స్కోడా కుషాక్, స్లావియా కార్లలో కూడా ఇలాంటి మార్పులే రాబోతున్నాయి. రెండు కంపెనీలు టెక్నాలజీని షేర్ చేసుకోవడం వల్ల తయారీ ఖర్చు తగ్గి, కస్టమర్లకు సరసమైన ధరలో హై-టెక్ కార్లు అందుతాయని కంపెనీ ఆశిస్తోంది. 2026 ఫేస్‌లిఫ్ట్ తర్వాత, 2027 నాటికి ఈ కార్లలో నెక్స్ట్ జనరేషన్ మార్పులు ఉంటాయని సమాచారం. భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ పై 7-సీటర్ వెర్షన్లను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేవలం ఇంజిన్ పవర్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, సేఫ్టీలో కూడా తామే మేటి అని నిరూపించుకోవడానికి ఫాక్స్ వ్యాగన్ సిద్ధమైంది. అడాస్ ఫీచర్లు తోడవడంతో టైగూన్, వర్టస్ కార్ల విలువ మరింత పెరగనుంది. ముఖ్యంగా డ్రైవింగ్ అంటే ఇష్టపడే వారికి , జర్మన్ బిల్డ్ క్వాలిటీతో పాటు ఈ హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు తోడవ్వడం ఒక గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ పై మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News