New Kia Seltos: సరికొత్త కియా సెల్టోస్.. లాంచ్ ఎప్పుడంటే..?
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఒక ప్రధాన వాహన తయారీదారుగా అవతరించింది. ఇది భారత మార్కెట్లో 'సెల్టోస్' ఎస్‌యూవీని విజయవంతంగా విక్రయిస్తోంది
New Kia Seltos: సరికొత్త కియా సెల్టోస్.. లాంచ్ ఎప్పుడంటే..?
New Kia Seltos: దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఒక ప్రధాన వాహన తయారీదారుగా అవతరించింది. ఇది భారత మార్కెట్లో 'సెల్టోస్' ఎస్‌యూవీని విజయవంతంగా విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా దీనిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ అదే కారును కొత్త రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2వ తరం 'సెల్టోస్' బుధవారం డిసెంబర్ 10 అంతర్జాతీయంగా ఆవిష్కరించనుంది. ఈ కారు అంచనా ధర, ఫీచర్ల గురించి వివరంగా తలుసుకుందాం.
కొత్త కియా సెల్టోస్ పోటీ ధరకు కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రస్తుత 'సెల్టోస్' కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 11.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని చెబుతున్నారు. ఇది ఆకర్షణీయమైన వేరియంట్లలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కొత్త కారు బయట చాలా చక్కని డిజైన్ ఉంటుంది. ఇప్పటికే, దీనిని 2 వేర్వేరు టీజర్‌లు నిర్ధారించాయి. ఇందులో కొత్త బంపర్, 'టైగర్ ఫేస్' ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, గ్లాస్ బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. ఇది మరింత విశాలంగా ఉంటుంది. 4,365 మి.మీ పొడవు, 1,800 మి.మీ వెడల్పు, 1,645 మి.మీ ఎత్తు ఉంటుంది. 190మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ , 2,610 మి.మీ వీల్‌బేస్ ఉంటుందని భావిస్తున్నారు.
ఈ కారులో స్టాండర్డ్ 'సెల్టోస్' లాగా, 5 సీట్లు ఉంటాయి. ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని సుదూర పట్టణాలకు సులభంగా ప్రయాణించగలరు. ఇది 433 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుందని చెబుతున్నారు, ఇది వారాంతాల్లో, సెలవు దినాల్లో సుదూర నగరాలకు వెళ్లేటప్పుడు మీరు ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది.
రెండవ తరం కియా సెల్టోస్ ఎస్‌యూవీలె శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఉంటుంది. ప్రస్తుత 'సెల్టోస్' లాగానే ఇది 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ ఎంపికను కలిగి ఉంటుందని చెబుతున్నారు. దీని క్యాబిన్ డిజైన్ బాగుంటుంది. డ్రైవర్ డిస్ప్లే కోసం డ్యూయల్-స్క్రీన్ సెటప్, డ్యూయల్-జోన్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను ఇది పొందుతుందని భావిస్తున్నారు.