Maruti Suzuki Wagon R: మారుతి లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. కాస్ట్‌లీగా మారనున్న ఆ ఫ్యామిలీ కార్..!
Maruti Suzuki Wagon R: మారుతి సుజికి దేశంలో ఫేమస్ కార్ల కంపెనీ. అరేనా, నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మార్కెట్లో పదివేల కార్లను విక్రయిస్తోంది.
Maruti Suzuki Wagon R: మారుతి సుజికి దేశంలో ఫేమస్ కార్ల కంపెనీ. అరేనా, నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మార్కెట్లో పదివేల కార్లను విక్రయిస్తోంది. తయారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి అన్ని కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.32,500కి పెంచుతున్నట్లు మారుతి ప్రకటించింది. ఈ ధరల పెంపు మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తాకింది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధర రూ.13,000 వరకు పెరిగింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఈ కారు LXI, VXI, ZXI వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మీరు కూడా వ్యాగన్‌ఆర్ లవర్స్ అయితే ఈ కారు ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
మారుతి వ్యాగన్ఆర్ గ్యాలంట్ రెడ్, పూల్‌సైడ్ బ్లూ, సుపీరియర్ వైట్, సిల్కీ సిల్వర్, మాగ్మా గ్రే వంటి కలర్ అందుబాటులో ఉంది. కారులో ఐదుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. వీకెండ్, హాలిడే ట్రిప్‌లకు వెళ్లేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 341 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ మూడు పవర్‌ట్రెయిన్‌లు ఉన్నాయి. అందులో మొదటి 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67 పిఎస్ హార్స్ పవర్, 89 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. రెండవ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90 పిఎస్ హార్స్‌పవర్, 113 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడో 1-లీటర్ ఇంజన్ 57 పిఎస్ హార్స్ పవర్. 89 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
ఈ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌ల ప్రకారం 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు బైక్‌లతో పోటీగా లీటర్‌పై 23.56 నుంచి 34.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు పెరిగే ఇతర మోడళ్లు
మారుతి సుజుకి ఆల్టో కె10 రూ.19,500, సెలెరియో రూ.32,500, బ్రెజ్జా రూ.20,000, ఎర్టిగా రూ.15,000, గ్రాండ్ విటారా రూ.25,000, ఎస్-ప్రెస్సో రూ.5,000, స్విఫ్ట్ 5,000, వాన్‌జీర్ రూ.1,000 12,000, ఇగ్నిస్ రూ.6,000, బాలెనో రూ.9,000, సియాజ్ రూ.1,500, ఎక్స్ ఎల్6 రూ.10,000, ఫ్రాంక్ రూ.5,500, ఇన్విక్టో రూ.30,000, జిమ్నీ రూ.1,500.