Aprilia Tuono 457 : కేటీఎం, యమహా గుండెల్లో రైళ్లు.. మార్కెట్లోకి అప్రిలియా టువోనో 457 ఎంట్రీ

కేటీఎం, యమహా గుండెల్లో రైళ్లు.. మార్కెట్లోకి అప్రిలియా టువోనో 457 ఎంట్రీ

Update: 2026-02-27 04:23 GMT

 Aprilia Tuono 457 : బైక్ రైడింగ్‌ను అమితంగా ఇష్టపడే కుర్రాళ్లకు ఇటాలియన్ బ్రాండ్ అప్రిలియా నుంచి అదిరిపోయే వార్త వచ్చింది. తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన RS 457 స్పోర్ట్స్ బైక్ ఆధారంగా, ఇప్పుడు సరికొత్త అప్రిలియా టువోనో 457మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది ఒక పక్కా 'స్ట్రీట్ ఫైటర్' లుక్‌తో కేవలం వేగం కోసమే కాకుండా, రోజువారీ ప్రయాణాల్లో కూడా సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయబడింది. భారత మార్కెట్లో ఈ బైక్ ధర రూ.3.95 లక్షల (ప్రారంభ ధర) నుంచి ఉండబోతోంది.

ఈ బైక్ ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే.. ఇందులో 457 cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 47.6 bhp పవర్, 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న 270-డిగ్రీల క్రాంక్ సెటప్ వల్ల బైక్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చే సౌండ్, వేగం పెంచే విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో ఓవర్‌టేక్ చేయడానికి లేదా హైవేపై దూసుకుపోవడానికి ఈ ఇంజన్ పవర్ సరిగ్గా సరిపోతుంది. స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల గేర్లు మార్చేటప్పుడు బైక్ అదుపు తప్పకుండా స్మూత్‌గా సాగుతుంది.

డిజైన్ పరంగా టువోనో 457 చాలా షార్ప్‌గా, మజిల్ బాడీతో కనిపిస్తుంది. దీని LED హెడ్ లైట్ సెటప్, మ్యాకో లుక్ ఇచ్చే ఫ్యూయల్ ట్యాంక్ రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. దాదాపు 175 కిలోల బరువు ఉండటం వల్ల దీన్ని హ్యాండిల్ చేయడం సులభం. 5-అంగుళాల TFT డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఇది టెక్నాలజీ పరంగా కూడా ముందంజలో ఉంది.

మైలేజ్ విషయానికి వస్తే.. ఈ స్థాయి పవర్ ఉన్న బైక్‌ల నుంచి మనం ఆశించే విధంగానే లీటరుకు సుమారు 24 నుంచి 26 కిలోమీటర్ల మైలేజీని ఇది అందిస్తుంది. 12.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ బైక్ KTM 390 Duke, Yamaha MT-03 వంటి దిగ్గజ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మీకు రిఫైన్డ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ తో పాటు ఒక ప్రీమియం బ్రాండ్ బైక్ కావాలనుకుంటే అప్రిలియా టువోనో 457ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Tags:    

Similar News