Maruti Suzuki S Presso: ఈ కారు ఎవరికీ ఇష్టం లేదా? డిసెంబర్‌లో 8 మందే కొన్నారు
ఈ కారు ఎవరికీ ఇష్టం లేదా? డిసెంబర్‌లో 8 మందే కొన్నారు
Maruti Suzuki S Presso: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒకటి. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ కారుని ప్రస్తుతం కేవలం రూ.4.26 లక్షల ప్రారంభ ధరకే విక్రయిస్తున్నారు. ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ.6.11 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇంత తక్కువ ధరకే ఈ కారు లభిస్తున్నప్పటికీ, అమ్మకాలు మాత్రం రోజురోజుకు తగ్గిపోతున్నాయి.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో డిసెంబర్ 2024 నెల సేల్స్ రిపోర్ట్‌ను ఈ రోజు విడుదల చేసింది. దీని ప్రకారం, డిసెంబర్ 2024లో మారుతి సుజుకి కేవలం 8 ఎస్-ప్రెస్సో కార్లను మాత్రమే విక్రయించింది. ఆశ్చర్యపోకండి, ఔను మీరు చదివింది నిజమే. 2024 డిసెంబర్ నెలలో కేవలం 8 మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మరింత షాకింగ్ విషయం ఏంటంటే, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అమ్మకాలు మరో 87 శాతం పడిపోయాయని కంపెనీ తెలిపింది.
మారుతి సుజుకి డిసెంబర్ 2023లో 60 S-ప్రెస్సో కార్లను విక్రయించింది. కానీ డిసెంబర్ 2024లో ఈ సంఖ్య కేవలం 8కి తగ్గింది. ఇది 87 శాతం తగ్గుదల. మారుతి సుజుకి S-ప్రెస్సో కారుకు మంచి మైలేజీతో సరసమైన ధరలో వచ్చే కారుగా పేరుంది. మారుతి సుజుకి S-ప్రెస్సో CNG వేరియంట్ కారు 32.73 kmpl మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సేఫ్టీ విషయానికి వస్తే.. ఇది పిల్లల భద్రతపై జీరో స్టార్ పొందింది. అందుకే చాలా మంది కస్టమర్లు ఈ కారును కొనడానికి ఇష్టపడటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో డిజైన్‌ను మిస్ చేయకూడదని చాలా మంది వినియోగదారులు భావిస్తున్నారు.
రానున్న రోజుల్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మారుతి సుజుకి భారతదేశంలో నంబర్-1 కార్ల తయారీ సంస్థ. అయినప్పటికీ, దీనికి కొన్ని 'ఫెయిల్యూర్' మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ 'వైఫల్యం' జాబితాలో చేరిన మరో కారు ఈ ఎస్-ప్రెస్సో.