Mahindra Scorpio N: ప్రమాదాలు ముందే డ్రైవర్‌కి తెలిసేట్టుగా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్స్
Mahindra Scorpio N: మహింద్రా అండ్ మహింద్రా స్కార్పియోలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉన్న కొత్త వాహనాన్ని తీసుకొచ్చింది. లెవెల్ 1 సక్సెస్ కావడంతో లెవెల్ 2ను మార్కెట్లోకి తీసుకొచ్చామని తాజాగా వెల్లడించింది.
Mahindra Scorpio N: ప్రమాదాలు ముందే డ్రైవర్‌కి తెలిసేట్టుగా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్స్
Mahindra Scorpio N: మహింద్రా అండ్ మహింద్రా స్కార్పియోలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉన్న కొత్త వాహనాన్ని తీసుకొచ్చింది. లెవెల్ 1 సక్సెస్ కావడంతో లెవెల్ 2ను మార్కెట్లోకి తీసుకొచ్చామని తాజాగా వెల్లడించింది. దీంతో పాటు రూ. 20.29 లక్షల ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త వాహనం వివరాలు చూద్దాం.
మహింద్రా అండ్ మహింద్ర మూడేళ్ల క్రితం స్కార్పియో ఎన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 2.5 లక్షలమంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకుందని తాజాగా ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు దీనికి లెవెల్ 2గా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిసటమ్స్ ను జెడ్ 8 ఎల్ వేరియంట్‌లో ఈ సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులో చాలావరకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి.
వెహికల్ ఫీచర్స్
తాజాగా విడుదల చేసిన లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లో జెడ్ 8 ఎల్ వేరియంట్ ఉంటుంది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ .. వంటి ఎన్నో అధునాతనమైన భద్రతా ఫీచర్లు ఈ కొత్త వెహికల్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్నీ ఈ కారు డ్రైవింగ్ చేస్తున్నవారికోసమే. డ్రైవర్ సీట్‌లో కూర్చున్నవాళ్లకు అవగాహనను పెంచడం, ప్రమాదాలను తగ్గించడం వంటిని లక్ష్యంగా చేసుకుని ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
వీటితో పాటు ఈ వాహనంలో స్పీట్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్, అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికల్ ఎప్పుడైతే నిర్ధిష్టమైన వేగాన్ని దాటుతుందో అప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్‌కు సమాచారాన్ని అందిస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేస్తే చాలు క్రూయిజ్ కంట్రోల్ సట్టింగ్‌ను వాడుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ వెహికల్ అలర్ట్ ద్వారా ముందున్న వెహికల్ స్టార్ట్ అయితే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఉన్న హెవీ ట్రాఫిక్ రోడ్లలో బాగా ఉపయోగపడుతుందని ఎమ్ అండ్ ఎమ్ సంస్థ చెబుతోంది.