Kia Syros Launched: కియా 'సైరోస్' వచ్చేసింది.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి

Kia Syros Launched: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా సరికొత్త 'సైరోస్' ఎస్‌యూవీని విడుదల చేసింది.

Update: 2025-02-01 10:49 GMT

Kia Syros Launched: కియా 'సైరోస్' వచ్చేసింది.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి

Kia Syros Launched: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా సరికొత్త 'సైరోస్' ఎస్‌యూవీని విడుదల చేసింది. అలానే కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను కూడా ప్రకటించింది. మార్కెట్లో కియా సైరోస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9 లక్షల నుండి మొదలై టాప్ మోడల్‌కు రూ. 17.80 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ జనవరి 3 నుండి 25,000 రూపాయల టోకెన్ అమౌంట్‌తో కియా సైరోస్ బుకింగ్స్ ప్రారంభించింది. డెలివరీ ఫిబ్రవరి మధ్య నుండి ప్రారంభవుతాయి. కియా సైరోస్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కియా సైరోస్ వేరియంట్స్, వాటి ధరలు 

HTK - రూ. 8.99 లక్షలు

HTK (O) - రూ. 9.99 లక్షలు

HTK+ - రూ. 11.49 లక్షలు

HTX - రూ. 13.29 లక్షలు

HTX+ - రూ. 15.99 లక్షలు

HTX+  (O) - రూ. 16.79 లక్షలు

కియా సైరోస్ డిజైన్

సైరోస్‌లో వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, సైడ్ ప్రొఫైల్‌లో ఆల్-బ్లాక్ A-, C-, D- పిల్లర్లు, రూఫ్ రెయిల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బాడీ మధ్య ఫ్లాట్ గ్లాస్ ఏరియా వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. ఎస్‌యూవీ వెనుక భాగంలో హై-మౌంటెడ్ L- షేప్ టెయిల్-ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక బంపర్ టూ-టోన్ బ్లాక్, సిల్వర్ ఫినిషింగ్‌తో వస్తుంది. 

కియా సైరోస్ ఫీచర్స్

ఈ ఎస్‌యూవీ కారులో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ అందించారు. కారు మొత్తం 4 సీట్లకు వెంటిలేషన్, యాంబియంట్ లైటింగ్, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అయితే భద్రత కోసం ఎస్‌యూవీ ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ సూట్‌ ఉంది.

కియా సైరోస్ పవర్‌ట్రెయిన్

ఈ కారు పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే... ఎస్‌యూవీ‌లో 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 120bhp పవర్, 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే ఎస్‌యూవీలో 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 116bhp పవర్, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కియా సైరోస్ కలర్స్

కియా సైరోస్ అరోరా బ్లాక్ పెర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్, స్పార్క్లింగ్ సిల్వర్ వంటి మొత్తం 8 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కొత్త స్కోడా కైలాక్, హ్యుందాయ్ వెన్యూ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.

Tags:    

Similar News