Jeep Compass Discounts: జీప్ బంపర్ ఆఫర్.. రూ.2.80 లక్షల వరకు తగ్గింపుతో కారును సొంతం చేసుకునే ఛాన్స్.. లిమిటెడ్ కాలం వరకే అవకాశం..!
Jeep Compass Discounts: జీప్ ఇండియా ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన కంపాస్ ఎస్‌యూవీపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది.
Jeep Compass Discounts: జీప్ బంపర్ ఆఫర్.. రూ.2.80 లక్షల వరకు తగ్గింపుతో కారును సొంతం చేసుకునే ఛాన్స్.. లిమిటెడ్ కాలం వరకే అవకాశం..!
Jeep India Compass SUV gets benefits of up to Rs. 2.80 lakhJeep Compass Discounts: జీప్ ఇండియా ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన కంపాస్ ఎస్‌యూవీపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. మే నెలలో ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే మీకు రూ. 2.80 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.99 లక్షలు. కంపాస్‌పై కంపెనీ రూ.1.70 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.1.10 లక్షల ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ నెలలో మీరు ప్రీమియం ఎస్‌యూవీ కొనాలని చూస్తున్నట్లయితే, కంపాస్ కొనడానికి ఇది మంచి అవకాశం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jeep Compass Engine
జీప్ కంపాస్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది.ఈ ఇంజిన్ 170పిఎస్ పవర్, 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ కోసం, ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంది. కంపాస్‌ను ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ రెండు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. మైలేజ్ విషయానికొస్తే, ఇది లీటరుకు 15 నుండి 17 కి.మీ మైలేజీని ఇస్తుంది.
Jeep Compass Features
కంపాస్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇందులో కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీతో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. అలానే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-వే అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై కూడా కంపెనీ పని చేస్తోంది.
Jeep Compass Safety
కంపాస్ భద్రత గురించి మాట్లాడుకుంటే, ఇందులో ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు. దీనితో పాటు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీనిలో అడాస్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ టక్సన్, టాటా హారియర్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.