Hyundai Venue : రూ.7.99 లక్షలకే లగ్జరీ..అమ్మకాల్లో రికార్డు..కొత్త వెన్యూ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

రూ.7.99 లక్షలకే లగ్జరీ..అమ్మకాల్లో రికార్డు..కొత్త వెన్యూ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Update: 2026-02-02 04:50 GMT

Hyundai Venue : హుందాయ్ మోటార్ ఇండియా 2026 ఏడాదిని అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభించింది. జనవరి నెలలో కంపెనీ ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసి మార్కెట్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా హుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ తన సెగ్మెంట్‌లో రారాజుగా నిలిచింది. కియా సోనెట్, మారుతీ సుజుకి సిరోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తూ, మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ ఛాయిస్‌గా మారిపోయింది. కేవలం ఒక్క నెలలోనే భారీగా అమ్ముడై హుందాయ్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

హుందాయ్ మోటార్ ఇండియా 2026 జనవరి నెలలో ఏకంగా 73,137 కార్లను విక్రయించి తన సత్తా చాటుకుంది. ఇందులో దేశీయ అమ్మకాలు 59,107 కాగా, 14,030 కార్లను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాల్లో హైలైట్‌గా నిలిచింది మాత్రం హుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ. కేవలం జనవరిలోనే 12,413 యూనిట్ల వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ మోడల్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. వెన్యూ తో పాటు హుందాయ్ ఆరా సెడాన్ కూడా 7,978 యూనిట్లతో సత్తా చాటింది.

ఈ స్థాయిలో అమ్మకాలు జరగడానికి ప్రధాన కారణం నవంబర్ 2025లో లాంచ్ అయిన కొత్త జనరేషన్ వెన్యూ. దీని ప్రారంభ ధర కేవలం రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే ఉండటంతో జనం దీనికి క్యూ కడుతున్నారు. కొత్త వెన్యూ ఎక్స్‌టీరియర్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. సీ-షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఫ్యూచరిస్టిక్ లుక్ దీనికి లగ్జరీ టచ్ ఇచ్చాయి. లోపల డ్యూయల్ 12.3-అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయంలోనూ రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 అడాస్ ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తున్నారు.

హుందాయ్ వెన్యూలో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు ఉండటం కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లలో ఇది లభిస్తోంది. అంతేకాదు మాన్యువల్, ఆటోమేటిక్, డీసీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు 20కి పైగా వేరియంట్లలో, రూ.7.99 లక్షల నుంచి రూ.15.69 లక్షల ధరల మధ్య దొరుకుతున్న ఈ కారు స్టైల్,పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్ గా మారింది. అందుకే 2026 ఆరంభంలోనే వెన్యూ ఇంతటి ఘన విజయాన్ని అందుకుంది.

Tags:    

Similar News