Hyundai i10 Nios Discount: త్వరపడండి.. ఈ కారుపై భారీగా డిస్కౌంట్.. మైలేజ్ దుమ్ములేపుతుంది..!
Hyundai i10 Nios Discount: హ్యుందాయ్ ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియో ఎంట్రీ-లెవల్ కారు గ్రాండ్ i10 నియోస్‌పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.
Hyundai i10 Nios Discount: త్వరపడండి.. ఈ కారుపై భారీగా డిస్కౌంట్.. మైలేజ్ దుమ్ములేపుతుంది..!
Hyundai i10 Nios Discount: హ్యుందాయ్ ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియో ఎంట్రీ-లెవల్ కారు గ్రాండ్ i10 నియోస్‌పై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ కారు కొనుగోలు చేయడం ద్వారా మీకు రూ. 80,000 ప్రయోజనం లభిస్తుంది. గత నెలతో పోలిస్తే, కంపెనీ తన డిస్కౌంట్‌ను రూ.12,000 పెంచింది. దాని CNG వేరియంట్‌పై గరిష్టంగా రూ. 80,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. పెట్రోల్-MT వేరియంట్‌పై రూ. 75,000,AMT వేరియంట్‌పై రూ. 60,000 ప్రయోజనాలు ఇస్తున్నారు. ఈ కారు ఎరా వేరియంట్ పై రూ.45,000 వరకు ప్రయోజనం ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.98 లక్షల నుండి రూ. 8.62 లక్షల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ ఐ10 నియోస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 83 పిఎస్ పవర్, 113.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, స్మార్ట్ ఆటో AMT ఉన్నాయి. ఈ కారు మోనోటోన్ టైటాన్ గ్రే, పోలార్ వైట్, ఫైరీ రెడ్, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్, టీల్ బ్లూ రంగులలో లభిస్తుంది. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో స్పార్క్ గ్రీన్ ఉన్నాయి.
i10 నియోస్ సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఫుట్‌వెల్ లైటింగ్, టైప్ C ఫ్రంట్ యూఎస్‌బి ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను పొందుతుంది. ఇతర అప్‌డేట్లతో నిగనిగలాడే బ్లాక్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్, కనెక్ట్ చేసిన డిజైన్‌తో ఎల్ఈడీ టెయిల్ లాంప్‌లు ఉన్నాయి. ఇంటీరియర్స్ డాష్‌బోర్డ్‌పై కొత్త గ్రే కలర్, అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
i10 నియోస్‌లో క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన అత్యుత్తమ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇందులో ఎకో కోటింగ్ టెక్నాలజీ, వెనుక ఏసీ వెంట్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెనుక పవర్ అవుట్‌లెట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి చూడచ్చు.