Royal Enfield: పడిపోయిన రాయల్ ఎన్‎ఫీల్డ్ అమ్మకాలు.. కానీ ఆ మోడల్‎కు మాత్రం భారీ డిమాండ్

Royal Enfield: భారతీయ బైక్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఏప్రిల్ 2025 నెల కొంచెం నిరాశను మిగిల్చింది. కంపెనీ అమ్మకాలు మార్చి నెలతో పోలిస్తే 13.68శాతం తగ్గాయి.

Update: 2025-05-31 02:45 GMT

Royal Enfield: పడిపోయిన రాయల్ ఎన్‎ఫీల్డ్ అమ్మకాలు.. కానీ ఆ మోడల్‎కు మాత్రం భారీ డిమాండ్

Royal Enfield: భారతీయ బైక్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఏప్రిల్ 2025 నెల కొంచెం నిరాశను మిగిల్చింది. కంపెనీ అమ్మకాలు మార్చి నెలతో పోలిస్తే 13.68శాతం తగ్గాయి. అయితే, గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే మాత్రం 1.28శాతం స్వల్ప వృద్ధి కనిపించింది. మార్చిలో 88,050 బైక్‌లు అమ్ముడైతే, ఏప్రిల్‌లో 76,002 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. అయినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులను ఆకట్టుకున్న ఓ బైక్ మాత్రం అమ్మకాల్లో దూసుకుపోయింది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారతదేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు. కొన్ని మోడల్స్ ఎప్పుడూ అమ్మకాల్లో ముందుంటాయి. అయితే, మిగిలిన బైక్‌లతో పోలిస్తే ఒక బైక్ పనితీరు అద్భుతంగా ఉంది. అదే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. ఇది కంపెనీలో అత్యంత చవకైన బైక్ కూడా. 2022లో యువతను దృష్టిలో ఉంచుకొని హంటర్ 350ని లాంచ్ చేశారు. లాంచ్ అయినప్పటి నుంచే ఇది త్వరగా విజయం సాధించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర 1.50 లక్షల రూపాయల నుండి మొదలవుతుంది. ఏప్రిల్ నెలలో హంటర్ 350.. 18,109 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది మార్చి నెలలో అమ్ముడైన 16,958 యూనిట్ల కంటే 6.7శాతం ఎక్కువ. అంతేకాకుండా, ఏప్రిల్ 2024లో అమ్ముడైన 16,186 యూనిట్లతో పోలిస్తే 11.8% ఎక్కువ. ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన బైక్ ఇదే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత పాపులర్ బైక్ క్లాసిక్ 350 ఈ లిస్ట్‌లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది కంపెనీలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన బైక్. ఏప్రిల్ నెలలో క్లాసిక్ 350 యొక్క 26,801 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, మార్చి నెలలో 33,115 యూనిట్లు అమ్ముడవగా, నెలవారీ అమ్మకాల్లో 9శాతం పైగా తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 29.82శాతం పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత పాత మోడల్ అయిన బుల్లెట్ 350 కూడా ఏప్రిల్ నెలలో మంచి అమ్మకాలు సాధించింది. గత నెలలో 16,489 యూనిట్ల అమ్మకాలతో నెలవారీగా 25% వృద్ధిని చూపింది. కానీ, మార్చి నెలలో 21,987 యూనిట్లు అమ్ముడవగా, నెలవారీ అమ్మకాల్లో 25శాతం తగ్గుదల కనిపించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో బుల్లెట్ 350 రెండో అత్యంత చవకైన మోటార్‌సైకిల్, దీని ధర ఎక్స్-షోరూమ్ 1.75 లక్షల రూపాయలు. మొత్తంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టినా, హంటర్ 350 వంటి చవకైన మోడల్స్ యువతను ఆకర్షిస్తూ కంపెనీకి మంచి వృద్ధిని అందిస్తున్నాయి.

Tags:    

Similar News