Auto News: ఫుల్ ఛార్జ్‌తో 408 కి.మీల దూరం.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన చెరీ న్యూ ఎనర్జీ కార్.. ధర రూ. 9 లక్షలలోపే..!
Chery New Energy Car: చైనాకు చెందిన చెరీ న్యూ ఎనర్జీ తన దేశీయ మార్కెట్లోకి కొత్త లిటిల్ యాంట్‌ను విడుదల చేసింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 8.92 లక్షలుగా ఉంది.
Auto News: ఫుల్ ఛార్జ్‌తో 408 కి.మీల దూరం.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన చెరీ న్యూ ఎనర్జీ కార్.. ధర రూ. 9 లక్షలలోపే..!
Chery New Energy- New Little Ant: చైనాకు చెందిన చెరీ న్యూ ఎనర్జీ తన దేశీయ మార్కెట్లోకి కొత్త లిటిల్ యాంట్‌ను విడుదల చేసింది. దీని ధర 77,900 యువాన్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 8.92 లక్షలుగా ఉంటుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర 82,900 యువాన్లు (సుమారు 9.49 లు). చెరీ న్యూ ఎనర్జీ అనేది చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చెరీ ఆటోమొబైల్ కంపెనీ లిమిటెడ్‌లో ఒక భాగం.
రంగు ఎంపిక..
చెర్రీ కొత్త లిటిల్ యాంట్ క్లాసిక్ లిటిల్ యాంట్ అప్‌డేట్ వర్షన్‌గా వచ్చింది. అయితే, రెండు వాహనాలను కలిపి విక్రయించనున్నారు. కొత్త లిటిల్ యాంట్ ఆకర్షణీయమైన రంగులను కలిగి ఉంది. ఇది ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, ఊదా, పీచు, కిత్తలి నీలం, తెలుపు, బూడిద రంగులతో సహా మొత్తం 7 రంగు షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్స్..
కొత్త లిటిల్ యాంట్‌లో రిఫ్రెష్ చేసిన డ్యాష్‌బోర్డ్, పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత ఆధునికంగా కనిపించే స్టీరింగ్ వీల్, సన్నగా ఉండే ఎయిర్ వెంట్‌లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, లెదర్ సీట్ అప్హోల్స్టరీ, హీటెడ్ సీట్లు, స్టీరింగ్ వీల్, పెద్ద LED లైట్లు ఉన్నాయి. మేకప్ మిర్రర్, PM2.5 ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇవి కాకుండా వాయిస్ కంట్రోల్, రిమోట్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, పాదచారుల హెచ్చరిక వ్యవస్థ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. చెర్రీ న్యూ లిటిల్ యాంట్ 3242 mm పొడవు, 1670 mm వెడల్పు, 1550 mm ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 2150 మిమీ,గ్రౌండ్ క్లియరెన్స్ 120 మిమీ. దీని టర్నింగ్ వ్యాసార్థం 4.55 మీటర్లు.
బహుళ బ్యాటరీ ఎంపికలు..
ఇందులో అనేక బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీని 25.05 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ 251 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో, 28.86 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ, 29.23 kWh LFP బ్యాటరీ ప్యాక్ 301 కి.మీ. ఇవి కాకుండా, 40.3 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ ప్యాక్ 408 కి.మీ.లుగా ఉంది.