Best Bikes: బడ్జెట్ ధర.. అదిరిపోయే మైలేజీ! ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 5 బైక్స్!
Best Bikes: భారత ద్విచక్ర వాహన రంగంలో సామాన్యుడి 'కమ్యూటర్' బైక్‌ల హవా కొనసాగుతోంది.
Best Bikes: భారత ద్విచక్ర వాహన రంగంలో సామాన్యుడి 'కమ్యూటర్' బైక్‌ల హవా కొనసాగుతోంది. 100cc నుంచి 150cc విభాగంలో మైలేజ్, ధర ప్రాతిపదికన కస్టమర్లు కొన్ని మోడళ్లకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా వెల్లడైన డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం.. హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, టీవీఎస్ అపాచీ అనూహ్య వృద్ధిని నమోదు చేసింది.
1. హీరో స్ప్లెండర్ (Hero Splendor): నంబర్ 1 పొజిషన్
భారతీయుల ఆల్ టైమ్ ఫేవరెట్ బైక్ హీరో స్ప్లెండర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
అమ్మకాలు: 2,80,760 యూనిట్లు (గతేడాది కంటే 46% వృద్ధి).
మైలేజ్: లీటరుకు 65 - 70 కి.మీ.
ధర: రూ. 72,138 నుండి రూ. 86,074 (ఎక్స్-షోరూమ్).
2. హోండా షైన్ (Honda Shine): దూసుకుపోతున్న జపాన్ దిగ్గజం
మైలేజ్ మరియు పర్ఫార్మెన్స్‌కు మారుపేరుగా నిలిచిన హోండా షైన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.
అమ్మకాలు: 1,41,602 యూనిట్లు (40% వృద్ధి).
ధర: షైన్ 100 వేరియంట్ రూ. 65,268 నుండి ప్రారంభం.
3. బజాజ్ పల్సర్ (Bajaj Pulsar): యువత ఫేవరెట్
సరసమైన ధరలో స్పోర్టివ్ లుక్ కోరుకునే వారి కోసం బజాజ్ పల్సర్ సిరీస్ 11 మోడళ్లతో మార్కెట్లో దుమ్మురేపుతోంది.
అమ్మకాలు: 79,616 యూనిట్లు (21% వృద్ధి).
ధర: రూ. 91,750 నుండి రూ. 1.95 లక్షల వరకు.
4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe): బడ్జెట్ కింగ్
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారి మొదటి ఛాయిస్ ఇదే.
అమ్మకాలు: 49,051 యూనిట్లు (17% వృద్ధి).
ధర: రూ. 59,462 నుండి రూ. 65,760 వరకు.
5. టీవీఎస్ అపాచీ (TVS Apache): భారీ జంప్!
టాప్ 5 జాబితాలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది అపాచీ సిరీస్. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 118 శాతం అమ్మకాలు పెరగడం విశేషం.
అమ్మకాలు: 45,507 యూనిట్లు.
ధర: రూ. 1.19 లక్షల నుండి రూ. 2.72 లక్షల వరకు.