Hybrid Cars: 1200 కి.మీ. రేంజ్.. ఈ 3 హైబ్రిడ్ కార్లపై రూ.1.85 లక్షల భారీ డిస్కౌంట్!
Hybrid Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం, అలాగే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఎక్కువ దూరం వెళ్లాలని కోరుకోవడం వంటి కారణాలతో హైబ్రిడ్ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
Hybrid Cars: 1200 కి.మీ. రేంజ్.. ఈ 3 హైబ్రిడ్ కార్లపై రూ.1.85 లక్షల భారీ డిస్కౌంట్!
Hybrid Cars: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హైబ్రిడ్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం, అలాగే ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఎక్కువ దూరం వెళ్లాలని కోరుకోవడం వంటి కారణాలతో హైబ్రిడ్ వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో హైబ్రిడ్ కార్ల ఆప్షన్లు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో బాగా పెట్టుబడులు పెడుతూ, కొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.
సాధారణ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కంటే హైబ్రిడ్ కార్ల ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఒక ఎలక్ట్రిక్ సిస్టమ్, బ్యాటరీ, మోటారు ఉంటాయి. ఈ ఫీచర్లు కార్లను ఇంధన విషయంలో పొదుపుగా మార్చడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిస్కౌంట్లతో లభిస్తున్న మూడు ప్రముఖ హైబ్రిడ్ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. మారుతి గ్రాండ్ విటారా
మారుతి సుజుకికి చెందిన గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ప్రస్తుతం బాగా చర్చలో ఉన్న హైబ్రిడ్ కార్లలో ఒకటి. జులై 2025లో ఈ కారు కొనేవారికి రూ.1.85 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.70,000 వరకు నగదు తగ్గింపు, రూ.80,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉన్నాయి. మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌కు వస్తే 2024 మోడల్‌పై రూ.1.65 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. CNG వేరియంట్‌పై అయితే రూ.20,000 నగదు తగ్గింపు, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌పై రూ.1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. మైల్డ్ హైబ్రిడ్ మోడల్‌పై ₹1 లక్ష వరకు తగ్గింపు ఉంది. CNG వేరియంట్‌పై మొత్తం రూ.70,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇవే కాకుండా, ఈ వెర్షన్‌లలో డొమినియన్ ఎడిషన్ యాక్సెసరీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు, వీటి ధర దాదాపు రూ.57,900 ఉంటుంది.
2. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
టయోటాకు చెందిన ఈ ఎస్‌యూవీ కూడా మారుతి గ్రాండ్ విటారా లాగే స్ట్రాంగ్ హైబ్రిడ్, స్మార్ట్ హైబ్రిడ్ వెర్షన్‌లలో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌పై రూ.25,000 నగదు తగ్గింపు, రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. ఇప్పటికే టయోటా కారు ఓనర్ అయితే, రూ.50,000 వరకు లాయల్టీ బోనస్ కూడా పొందవచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ వెర్షన్‌పై మొత్తం రూ.75,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
3. హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ
హోండాకు చెందిన ఈ హైబ్రిడ్ సెడాన్ టెక్నాలజీ, పనితీరుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. దీని ZX వేరియంట్‌పై కంపెనీ రూ.95,000 వరకు తగ్గింపు ఇస్తోంది. గతంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.20.85 లక్షలు ఉండగా, ఇప్పుడు దాన్ని తగ్గించి రూ.19.89 లక్షలకు అమ్ముతున్నారు. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జత చేయబడ్డాయి. ఇది 126 బీహెచ్‌పీ పవర్, 253 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి eCVT గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ కారు 26.5 కి.మీ./లీటర్ మైలేజీని ఇస్తుంది. 1000 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది.