డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ .. సీబీఐ విచారణ జరిగితేనే మంచిది : వైసీపీ ఎంపీ

విశాఖ డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2020-05-22 15:16 GMT
Doctor sudhakar, MP Nandigam Suresh(file photo)

విశాఖ డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. సీబీఐ విచారణ జరిగితేనే మంచిదని,తాము కూడా అదే కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణలొనే వాస్తవాలు బైటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి లో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఓ వీడియో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు సుధాకర్‌ను అరెస్ట్ చేయడానికి బలమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయని సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు సంధించారు. చంద్రబాబు డైరెక్షన్ లో సుధాకర్ సైకోలా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు ఇలాంటి వేషాలు ఇంకా ఎంతో మందితో వెయిస్తాడని అన్నారు. చంద్రబాబుకు ఈలాంటి విద్యలు కొత్తేమీ కాదని ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. హైకోర్టులో వచ్చే తీర్పులు ముందుగానే చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయని ఎంపీ సురేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు కాల్ డేటా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో ఇచ్చారని గుర్తు చేశారు.

Tags:    

Similar News