YS Sharmila: రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిల.. ఖమ్మం లేదా.. నల్గొండ నుండి ఎంపీగా పోటీ

Ys Sharmila: ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న షర్మిల

Update: 2024-01-02 08:24 GMT

YS Sharmila: రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిల.. ఖమ్మం లేదా.. నల్గొండ నుండి ఎంపీగా పోటీ

YS Sharmila: కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వైఎస్‌ షర్మిల రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి కాంగ్రెస్‌లో YSRTP విలీనం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మధ్నాహ్నం 3 గంటలకు షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు.

Tags:    

Similar News