పెదలందరికి ఇళ్ళు స్థలాలు అందాలి: సీఎం వీడియో కాన్ఫెరెన్స్

భూసేకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.

Update: 2020-02-25 13:37 GMT

కర్నూలు : భూసేకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయం కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన, పేదలందరికీ ఇల్లు, వైయస్సార్ పెన్షన్, గ్రామ, వార్డు సచివాలయం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దిశ పోలీస్ స్టేషన్లు తదితర వాటిపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సీఎం జగన్‌ సమీక్షించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి ఉసురూ తగలకూడదు. నా మాటగా చెబుతున్నా.

భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారిని సంతోష పెట్టి భూమిని తీసుకోవాలి. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలన్నారు. ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా తీసుకున్నాడు.. అనే మాట నాకు ఎక్కడా వినిపించకూడదు'అంటూ 13 జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ పేర్కొన్నారు.


Tags:    

Similar News