బైక్‌ చోరీ కేసులో ఇరికించారని మనస్తాపం.. నంద్యాలలో సెల్ఫీ వీడియో తీసి యువకుడి సూసైడ్‌

Crime News: నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2023-06-20 14:00 GMT

బైక్‌ చోరీ కేసులో ఇరికించారని మనస్తాపం.. నంద్యాలలో సెల్ఫీ వీడియో తీసి యువకుడి సూసైడ్‌

Crime News: నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ చోరీ కేసులో పోలీసులు ఇరికించారని తోటలైను నివాసి చెన్నబాబు మనస్థాపం చెందాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో పోలీసుల తీరును వివరించాడు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని... బూతులు తిట్టారని తెలిపాడు. అమ్మా క్షమించు అంటూ వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెన్నబాబు డిమాండ్ చేశాడు. అనంతరం రైలు కింద పడి చెన్నబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో పోలీసుల వేధింపులకు ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

Tags:    

Similar News