Jordar Varthalu: ఈ ఊర్లో ఐస్ క్రీం బంద్.. ఏకంగా ఫ్లెక్సీ కట్టిన గ్రామస్తులు
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గూడూరు గ్రామంలో ఐస్‌క్రీం అమ్మకాలపై గ్రామస్తులు నిషేధం విధించారు.
Jordar Varthalu: ఈ ఊర్లో ఐస్ క్రీం బంద్.. ఏకంగా ఫ్లెక్సీ కట్టిన గ్రామస్తులు
Jordar Varthalu: గూడూరు గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద హెచ్చరిక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. "ఈ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదు.. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి లోపలికి వస్తే రూ. 5,000 జరిమానా విధించబడును" అని ఆ ఫ్లెక్సీపై స్పష్టంగా రాసిపెట్టారు.
వైరల్ అవుతున్న గూడూరు ఐడియా:
గూడూరు గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. "తమ పిల్లల కోసం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అద్భుతం" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొన్ని గ్రామాలు కూడా గూడూరు బాటలోనే నడవడానికి సిద్ధమవుతుండటం విశేషం.